శామ్సంగ్ గెలాక్సీ M32 ధరలో భారీ కోత..!!

Updated on 28-Jun-2022
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ M32 పైన బిగ్ బిగ్ ప్రైస్ కట్

2,000 రూపాయల భారీ తగ్గింపు

ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది

ఇటీవల తన బడ్జెట్ సిరీస్ నుండి శామ్సంగ్ ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ M32. ఈ స్మార్ట్ ఫోన్ ధరలో భారీ కోతను, అంటే తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ M32 తక్కువ ధరలో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే, 64MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు 6000 mAh బిగ్ బ్యాటరీ వంటి చాలా ఆకర్షణీయమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి వుంది. శామ్సంగ్ ఇప్పడు ఈ ఫోన్ యొక్క రెండు వేరియంట్స్ పైన 2,000 రూపాయల భారీ తగ్గింపును విధించింది.

Samsung Galaxy M32 : ధర

గెలాక్సీ M32 5G బేసిక్ వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 రూపాయలు. అలాగే, 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధరకే వస్తుంది. Buy From Here         

Samsung Galaxy M32 : స్పెసిఫికేషన్స్

ఈ శాంసంగ్ ఫోన్ 6.4 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ U డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ Helio G80 SoC తో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది.

ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 20ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. అయితే, ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను పవర్ బటన్‌తో క్లబ్ చేసి సైడ్‌లో ఇచ్చింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :