ఒక స్మార్ట్ ఫోనుకు ఎంత మాత్రమూ తీసిపోని విధంగా Reliance Jio తీసుకొచ్చినటువంటి Reliance Jio Phone 2 ఫీచర్ ఫోన్ ఇప్పుడు అద్భుతమైన అఫర్ ద్వారా అమ్ముడవుతోంది. ఈ క్వర్టీ కీబోర్డ్ ఫీచర్ ఫోన్ 4G నెట్వర్క్ తో పాటుగా Google Assistant, JioTv, Jio Cinema తో పాటుగా facebokk వంటి షోషల్ మెసేజింగ్ ప్లాట్ఫారం తో అవస్తుంది. మీకు నిరంతరం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా స్పీడ్ కనెక్టివిటీ అందించగల ఈ Reliance Jio Phone 2 ఇప్పుడు నెలకు కేవలం రూ. 141 రూపాయలు చెల్లించే EMI పద్దతి ద్వారా కూడా అమ్ముడవుతోంది.
వాస్తవానికి, ఈ ఫీచర్ ఫోన్ ప్రైస్ రూ. 2,999 రూపాయలు. అయితే, నెలకు కేవలం 141 రూపాయల EMI కట్టినా కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా జియో అందిస్తోంది. కాబట్టి, ఈ ఫోన్ కొనదలచిన వారు jio.com అంటే jio అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.
జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ కి తగిన వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతు తో వస్తుంది. అంతేకాదు, ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది, దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.
ఈ ఫోన్, 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, మీకు ఎక్కువ స్టోరేజి అప్షన్ ఇవ్వడం కోసం మైక్రో SD కార్డు స్లాట్ కూడా వుంది, దీనితో 128జీబీ వరకు స్టోరేజి విస్తరించే వీలుంది. . జియో ఫోన్ మాదిరిగానే, జియో ఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2MP రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.
రిలయన్స్ జీయో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన మంచి ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో, రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ (నాన్ జియో మినిట్స్ ) మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. అలాగే, రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, నాన్ జియో కాలింగ్ మినిట్స్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది.
చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్ కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో వస్తుంది.
Note: మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి.