జియోనీ రిలయన్స్ JIO మరియు PAYTM తో తన పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.

Updated on 30-Jun-2017

చైనా  స్మార్ట్ ఫోన్ మేకర్  కంపెనీ  జియోనీ  రిలయన్స్  JIO  మరియు PAYTM  తో తన పార్టనర్  షిప్  కుదుర్చుకుంది. దీని ద్వారా సంస్థ దాని వినియోగదారులకు అదనపు 4G డేటా మరియు నగదు వోచర్లు అందిస్తుంది.జియోనీ  తన  కొత్త ఆఫర్ "జియో-Gionee అదనపు డేటా"  కోసం JIO  తో పార్టనర్  షిప్ పెట్టుకుంది . ఈ ఆఫర్ కింద ఎన్నో జియోనీ  స్మార్ట్ ఫోన్స్ పై  యూజర్స్  కి ఫ్రీ గా 4G డేటా ఇవ్వబడుతుంది. సుమారు 60జీబీ  వరకు అందుకోగలరు .  PAYTM  తో  ఒప్పందం  కుదుర్చుకుని జియోనీ తన యూజర్స్  కి 700 రూ  లేదా  అంతకంటే ఎక్కువ  షాపింగ్  చేస్తే 500 రూపీస్ క్యాష్  బ్యాక్  అందిస్తుంది."జియో-Gionee అదనపు డేటా"   జియోనీ  స్మార్ట్ ఫోన్ కొనుగోలు  చేస్తే లభ్యమవుతుంది. ఈ ఆఫర్  16  జూన్  తరువాత కొనే  జియోనీ  స్మార్ట్ ఫోన్ ఫై లభిస్తుంది.  వీటిలో  Gionee Pioneer P5L, Gionee P7  కొంటె  2జీబీ ఎక్స్ట్రా  4జి  డేటా ప్రతీ  రీఛార్జ్  పై  లభిస్తుంది.అలానే  Gionee Elife S6, Gionee Elife S7, Gionee Marathon M5, Gionee S Plus, Gionee S6s, Gionee F103 Pro, Gionee marathon <5 lite CDMA, Gionee Marathon M4, Marathon M5 Lite, Gionee P7 Max, and Gionee F103 లు   కొంటె యూజర్స్  కి  ప్రతీ  రీఛార్జ్  పై 5జీబీ ఎక్స్ట్రా  4జి  డేటా ప్రతీ  రీఛార్జ్  పై  లభిస్తుంది.ఇవే కాక  Gionee A1, Gionee Marathon M5 Plus, Gionee S6 Pro,  మరియు  Gionee Elife E8  స్మార్ట్ ఫోన్స్ పై  10జీబీ ఎక్స్ట్రా  4జి  డేటా ప్రతీ  రీఛార్జ్  పై  లభిస్తుంది.   జియోనీ  దీనితో పాటుగా   PAYTM  తో చేసిన  ఒప్పందం ప్రకారం  Gionee A1  లేదా  P7 Max  కొంటె  250  రూ యొక్క రెండు   PAYTM  క్యాష్  బ్యాక్  ఆఫర్ పొందుతారు .

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :