రూ.141 రూపాయలకే జియో ఫోన్ 2 : ఇలా పొందండి

Updated on 09-May-2021
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్ ఫోన్

జియో ఫోన్ 2 రూ.141 రూపాయల అతితక్కువ EMI ధరకే అందుబాటులో వుంది.

జియో ఫోన్ల కోసం మంచి ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంచింది

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్ ఫోన్ కోరుకొనేవారికి జియో ఫోన్ 2 మంచి ఎంపిక కావచ్చు. ఇప్పుడు ఈ జియో ఫోన్ 2 రూ.141 రూపాయల అతితక్కువ EMI ధరకే అందుబాటులో వుంది. వాస్తవానికి, ఇదేమి కొత్త అఫర్ కాకపోయినా కూడా అతి తక్కువ EMI తో ఒక 4G ఫీచర్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికీ ఇప్పటికీ ఇది హాట్ అఫర్ గా నిలుస్తుంది. అలాగే, జియో ఫోన్ల కోసం మంచి ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంచింది. అందుకే, ఈ అద్భుతమైన ఆఫర్ల గురించి మరొకసారి తెలుసుకుందాం.     

ఈ JioPhone 2 4G టెక్నాలజీతో వస్తుంది మరియు ఈ ఫీచర్ ఫోన్ ప్రైస్ రూ. 2,999 రూపాయలు మాత్రమే. అయితే,  నెలకు కేవలం 141 రూపాయల EMI కట్టినా కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా జియో అందిస్తోంది.  వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ తో వస్తుంది.          

Jio Phone 2  ఫీచర్స్

 జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ కి తగిన వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతు తో వస్తుంది. అంతేకాదు,  ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది, దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్,  512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, మీకు ఎక్కువ స్టోరేజి అప్షన్ ఇవ్వడం కోసం మైక్రో SD కార్డు స్లాట్ కూడా వుంది,  దీనితో  128జీబీ వరకు స్టోరేజి విస్తరించే వీలుంది. . జియో ఫోన్ మాదిరిగానే, జియో ఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2MP  రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.  

Jio Phone 2 Plans

రిలయన్స్ జీయో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన మంచి ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో, రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ (నాన్ జియో మినిట్స్ ) మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. అలాగే, రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, నాన్ జియో కాలింగ్ మినిట్స్,  జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది.

చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో వస్తుంది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :