Redmi Note 15 5G launch announced in india
Redmi Note 15 5G: రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కోసం టీజర్ విడుదల చేసింది షియోమీ. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ కనిపించేలా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సైడ్ యాంగిల్ ఫోటో తో టీజర్ విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి అందించే అప్ కమింగ్ ఫోన్ ను బిగ్ కెమెరా మరియు స్లీక్ డిజైన్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు, ఈ ఫోన్ గురించి ఒక ఐడియా కూడా ఇచ్చింది.
షియోమీ అప్ కమింగ్ ఫోన్ రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఫోన్ లాంచ్ కోసం జస్ట్ టీజర్ మాత్రమే విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి టీజ్ చేయబడింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అమెజాన్ ఈ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంది.
ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపించే డిజైన్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ ఎడిషన్ ఫోన్ గా వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ కనిపిస్తోంది మరియు పెద్ద కెమెరా బంప్ ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ లో చూడవచ్చు. రెడ్ మీ నోట్ కొత్త శకం లోకి అడుగు పెట్టండి, అని ఈ ఫోన్ గురించి కంపెనీ టీజింగ్ చేస్తోంది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉన్నట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇదే కాదు ఈ ఫోన్ వెనుక కూడా కర్వుడ్ గ్లాస్ డిజైన్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోన్ గొప్ప క్లారిటీ ఫోటోలు అందించే కెమెరా కలిగి ఉంటుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ లాంచ్ డేట్ తో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు షియోమీ టీజర్ పేజీ ద్వారా వెల్లడించింది.
Also Read: Jio Free Offer: రూ. 35,100 ఉచిత లాభాలు పొందాలంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయండి.!
అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఆన్లైన్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫోన్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 108MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉందని అంచనా వేసి చెబుతున్నారు. మరి ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అవుతోందో చూడాలి.