Redmi Note 12 5G: ఈరోజే విడుదలైన ఈ ఫోన్ వివరాలపైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Redmi ఈరోజు ఇండియాలో Redmi Note 12 5G Series నుండి మూడు ఫోన్లను విడుదల చేసింది

రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది

బడ్జెట్ ధరలో ఈరోజే విడుదలైన ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి

Redmi ఈరోజు ఇండియాలో Redmi Note 12 5G Series నుండి మూడు ఫోన్లను విడుదల చేసింది. ఇందులో Note 12, 12 Pro మరియు Note 12 Pro+ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో, రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 5G చిప్ సెట్, మంచి డిజైన్ మరియు Super AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగివుంది. బడ్జెట్ ధరలో ఈరోజే విడుదలైన ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Redmi Note 12 5G: ధర

రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ ను రూ.17,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఈ ఫోన్ జనవరి 11 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

బ్యాంక్ ఆఫర్స్:

ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI మరియు డెబిట్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,500 డిస్కౌంట్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్లను ఈ ఫోన్ అందించింది.         

Redmi Note 12 5G: స్పెక్స్

Redmi Note 12 5G ఫోన్ 6.67-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 4 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 6GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. 

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, 48MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ ఫ్రాస్టడ్ గ్రీన్, మెట్టే బ్లాక్ మరియు మిస్టిక్ బ్లూ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :