భారీ ఆఫర్లతో Redmi Note 11T 5G మొదటి సేల్..!

HIGHLIGHTS

Redmi Note 11T 5G యొక్క మొదటి సేల్

లేటెస్ట్ షియోమి ఇండియాలో విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపెను మద్యహ్నం 12 గంటలకి జరగనుంది. ఈ ఫోన్ ను భారీ ఆఫర్లతో ఈ సేల్ నుండి పొందవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ఇంట్రడక్టరి అఫర్ క్రింద 1,000 రూపాయల డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ICICI బ్యాంక్ కస్టమర్లకు 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. అంటే, మొత్తంగా 2000 రూపాయల డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను కొనేవీలుంది. 

Redmi Note 11T 5G: ప్రైస్

రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB  (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.17,999. ఇక చివరిడి 8GB ర్యామ్ మరియు 128GB  (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.19,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Amazon, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది.      

Redmi Note 11T 5G: స్పెక్స్

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :