Redmi: 67W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తున్నరెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ ఫోన్లు

Updated on 30-Mar-2022
HIGHLIGHTS

Redmi Note 11 Pro Series విడుదల చెయ్యడానికి డేట్ అనౌన్స్ చేసిన షియోమీ

టీజర్ ప్రకారం, ఈ ఫోన్స్ భారీ స్పెక్స్ తో వస్తున్నట్లు కనిపిస్తున్నాయి

ఇండియాలో మార్చి 9న ఈ ఫోన్లను విడుదల చేస్తునట్లు షియోమీ ప్రకటించింది

Redmi Note 11 Pro Series నుండి నోట్ 11 ప్రో మరియు నోట్ 11 ప్రో+ ఫోన్లను భారతదేశంలో విడుదల చెయ్యడానికి డేట్ అనౌన్స్ చేసిన షియోమీ, ఈ ఫోన్ల యొక్క కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది.  ఇండియాలో మార్చి 9న ఈ ఫోన్లను విడుదల చేస్తునట్లు షియోమీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్స్ షియోమీ అధికారిక వెబ్సైట్ మరియు Amazon ద్వారా ఇప్పటికే టీజ్ చేయబడుతున్నాయి. టీజర్ ప్రకారం, ఈ ఫోన్స్ భారీ స్పెక్స్ తో వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.  

Redmi Note 11 Pro Series: రివీల్డ్ &  అంచనా స్పెక్స్

ఈ సిరీస్ నుండి తీసుకురానున్న ఫోన్ల యొక్క కొన్ని కీలకమైన వివరాలను షియోమీ అందించిన టీజర్ ద్వారా వెల్లడించింది. వీటి ద్వారా మరిన్ని స్పెక్స్ ను అంచనా వేస్తున్నారు. టీజర్ ప్రకారం, ఈ సిరీస్ ఫోన్లను FHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో అందించినట్లు తెలిపింది. అంతేకాదు ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 1200 నైట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందిస్తుంది. అలాగే, ఈ డిస్ప్లే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ అందించే అవకాశం ఉంది.

ఈ ఫోన్లలో 108MP ప్రధాన కెమెరా గురించి ఇప్పటికే ప్రకటించింది. అయితే, రెండు ఫోన్ల కెమెరా సెటప్ లో ఉండే మైన్ కెమెరాలో అంతరం ఉంటుంది. 108 MP మైన సెన్సార్ Pro+ వేరియంట్ తో రావచ్చు. ఈ ఫోన్లలో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా వుంది మరియు డ్యూయల్ స్టెరో స్పీకర్ల గురించి కూడా టీజ్ చేస్తోంది.  

ఇక ఇంటర్నల్ స్పెక్స్ లోకి వెళితే, ప్రో ఎడిషన్‌లో హీలియో G96 ప్రోసెసర్ ఉండవచ్చు మరియు Pro+ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు. నోట్ 11 ప్రో+ వేరియంట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ తో ఉంటే, నోట్ 11 ప్రో+ మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉండవచ్చు. అలాగే, నోట్ 11 ప్రో ప్లస్ 5000mAh బ్యాటరీతో రావచ్చు, అయితే ప్రో మాత్రం చిన్న 4500mAh బ్యాటరీ తో ఉండవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :