త్వరలో రానున్న రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్ ఫోన్

Updated on 06-Jul-2021
HIGHLIGHTS

రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది

ఇటీవల రష్యన్ మార్కెట్లో లాంచ్

ఇండియన్ మార్కెట్ లోకి మరొక 5G ఫోన్

షియోమి అతి త్వరలో రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చెయ్యనుంది. ఇటీవల రష్యన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్, ఇక ఇండియన్ ని కూడా తాకనుంది. రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ స్పెక్స్ పరంగా పోకో ఎం 3 ని పోలి ఉంటుంది. ఎందుకంటే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రొసెసర్ Dimensity 700 తో రష్యన్ మార్కెట్లో విడుదల చేయయ్యబడింది.

ఈ ఫోన్ లాంచ్ డేట్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ను అమెజాన్ ఇండియా ద్వారా తీసుకురాబోతున్నట్లు టీజ్ చేస్తోంది. అంటే, ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ ఇండియాలో మాత్రమే లభిస్తుంది. రష్యన్ మార్కెట్లో ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ RUB 19,990 రేటుతో అందించింది. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.20,500 రూపాయలు.

ఇక రష్యాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 48MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :