అమెజాన్ సేల్ నుండి Redmi Note 10T 5G పైన బెస్ట్ ఆఫర్స్

Updated on 27-Jul-2021
HIGHLIGHTS

Redmi Note 10T 5G పైన బెస్ట్ ఆఫర్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు

షియోమి బడ్జెట్ 5G ఫోన్

ఇటీవల షియోమీ ఇండియాలో విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 10T 5G. Xiaomi ఈ 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా తక్కువ ధరలోనే ప్రకటించింది. ఈ రెడ్‌మి నోట్ 10 టి మీడియాటెక్ యొక్క బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ప్రొసెసర్ Dimensity 700 SoC మరియు 48MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది.

Redmi Note 10T 5G: ప్రైస్&ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10 టి యొక్క 4జిబి మరియు 64జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.13,999 రూపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 4జిబి మరియు 64జిబి స్టోరేజ్ ధర రూ. 15,999. ఈ ఫోన్ పైన ప్రారంభ అఫర్ క్రింద HDFC బ్యాంక్ కస్టమర్ల కోసం 10% డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ అమెజాన్ No Cost EMI నుండి  మరిన్ని అఫర్ లతో లభిస్తోంది. Buy From Here        

Redmi Note 10T 5G: స్పెక్స్

రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, క్రోమియం వైట్, మింట్ గ్రీన్ మరియు మెటాలిక్ బ్లూ అనే నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.       

రెడ్‌మి నోట్ 10 టి యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు 22.5W ఫాస్ట్ చార్జర్ బాక్స్ తోపాటుగా వస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :