సోనీ 48ఎంపీ కెమెరాతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన రెడ్మి నోట్ 10

HIGHLIGHTS

రెడ్మి నోట్ 10 ఇండియాలో లాంచ్ అయ్యింది

ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి వుంది

48MP కెమెరాని SonyIMX582 సెన్సార్ తో అందించింది

రెడ్మి నోట్ 10 ఇండియాలో లాంచ్ అయ్యింది. రెడ్మి నోట్ 10 సిరీస్ నుండి వచ్చిన ఫోన్స్ అన్నింటిలో కూడా తక్కువ ధరలో లభించే ఫోన్ రెడ్మి నోట్ 10. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,999 రుపాయల తక్కువ ధరలో 48MP సోనీ క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ, పెద్ద సూపర్ అమోలెడ్ స్క్రీన్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి వుంది.

రెడ్మి నోట్ 10 ధర:

రెడ్మి నోట్ 10 (4జీబీ + 64 జీబీ వేరియంట్) : రూ.11,999 

రెడ్మి నోట్ 10 (6జీబీ + 128 జీబీ వేరియంట్) : రూ.13,999

ఈ రెడ్మి నోట్ 10 స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల సూపర్ AMOLED డిస్ప్లే తో వుంటుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 పొరతో రక్షణ ఇచ్చింది. ఈ ఫోన్ అత్యధికంగా 1100 నైట్స్ గరిష్టమైన బ్రైట్నెస్ అందిస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  678 ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 611 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 స్కిన్ పైన పనిచేస్తుంది. 

ఇక కెమెరాల పరంగా, నోట్ 10 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని SonyIMX582 సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 13 MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :