విడుదల కంటే ముందుగానే Redmi K50i ను Jio 5G తో పరీక్షించిన కంపెనీ. రెడ్‌మి ఇండియా మరియు రిలయన్స్ జియో సంయుక్తంగా నిర్వహించిన ఈ 5G నెట్ వర్క్ టెస్టింగ్, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుందని సూచించింది. జూలై 20 న ఇండియాల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల కంటే ముందుగానే ఇండియాలో దీనిపైన 5G నెట్ వర్క్ టెస్టింగ్ ను నిర్వహిండం గమనార్హం. ఇప్పటికే, ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కంపెనీ బయటకు వెల్లడించింది. ఈ ఫోన్ Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో పాటుగా Dolby Atmos స్పోర్ట్ కలిగిన స్పీకర్ లతో వస్తోంది.
ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ మరియు సామర్ధ్యాలను చూడడానికి ఈ ఫోన్ ను కఠినమైన అప్లికేషన్ లతో ఎక్స్ ట్రీమ్ కండిషన్ లలో టెస్ట్ చేశారు. అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్‌లు రెండూ చాలా ఎక్కువగా ఉన్నాయని పరీక్ష ఫలితాలు చూపించాయి. అంతేకాదు, వివిధ తీవ్రమైన పరిస్థితులలో టెస్టింగ్ చేయబడినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. Redmi K50i స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వినియోగదారు ఉత్తమ అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యంగా చెబుతోంది. ఇది మాత్రమే కాదు, నెట్ వర్క్ లకు యాక్సెస్‌ను విస్తరించడానికి 12 5G బ్యాండ్ లను ప్యాక్ చేసిన మొదటి Redmi స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.
ఇక Redmi K50i 5G యొక్క మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా LPDDR5 RAM ను ఉన్నట్లు షియోమీ సూచించింది. అలాగే, ఈ ఫోన్ ను మరింత వేగంగా చల్లబరిచే LiquidCool 2.0 ఫీచర్ తో తీసుకువస్తున్నట్లు టీజర్ లో చూపించింది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లే ను కూడా ఈ ఫోన్ లో అందించినట్లు చూపిస్తోంది. Dolby Atmos స్పోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు, X-Axis వైబ్రేషన్ మోటార్, భారీ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తునట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది.