5G తో డిసెంబరు 10న విడుదలకానున్న REDMI K 30 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఈ ఫోన్ ఎటువంటి ప్రాసెసరుతో రానున్నదో మాత్రం తెలియచేయలేదు.

ఈరోజు ఉదయమే,  షావోమి త్వరలో తీసుకురానున్నట్లు చెబుతున్న స్మార్ట్ ఫోన్ అయినటువంటి, REDMI K30 గురించి లీకైన సమాచారం ద్వారా దీని స్పెక్స్ గురించి  మరిన్ని వివరాలను తెలుసుకోగా, సంస్థ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ని వెల్లడించింది. లాంచ్ డేట్ తో పాటుగా అందించిన టీజర్ ఇమేజి లో ఈ ఫోన్ 5G రానున్నట్లు కూడా పేర్కొంది. కానీ, ఈ ఫోన్ ఎటువంటి ప్రాసెసరుతో రానున్నదో మాత్రం తెలియచేయలేదు. 

ఎట్టకేలకు REDMI K30 స్మార్ట్ ఫోన్ను, డిసెంబరు 10 న చైనాలో కంపెనీ లాంచ్ చేయాలనీ చూస్తోందని తేటతెల్లమయ్యింది. ముందుగావచ్చిన లీక్స్ ద్వారా, ఇది ఒక పెద్ద పంచ్ హోల్ డిజైనుతో రానున్నట్లు కనిపిస్తోంది. అలాగే, ఒక 5G సపోర్టుతో ఈ ఫోన్ను తీసుకురానున్నట్లు ముందు నుండే చెబుతోంది, కానీ ఇక్కడ అందించిన లీక్ ఇమేజిలో ఇది Adreno 618 GPU తో కనిపిస్తోంది. అంటే, మనకు తెలుసు ఈ GPU స్నాప్ డ్రాగన్ 730 మరియు 730G తో వస్తుందని, ఇది గేమింగ్ కోసం మంచి ప్రాసెసర్ మాత్రమే ఇది 5G సపోర్ట్ కలిగిలేదు. దీని ప్రకారం, ఈ ఫోనులో 5G ఇవ్వడం గురించి వస్తున్నాఒట్టిమాటే కావచ్చు.

అధనంగా, ఈ లీకైన ఇమేజి ద్వారా మిగిలిన స్పెక్స్ గమనించినట్లయితే, ఇది ఒక 6.6 అంగుళాల స్క్రీన్ను 120Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఈ Adreno 618 GPU ని ఈ ఫోనులో చూస్తున్నాం కాబట్టి, ఈఫోలు రెడ్మి K 20 ప్రో స్మార్ట్ ఫోన్ మాదిరిగా ఒక స్నాప్ డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్ ని ఇస్తుందో లేదో చూడాల్సివుంటుంది. ఇక సంస్థ యొక్క CEO అయినటువంటి, లీ జున్ ఇది లాంచ్ సమయానికి MIUI 11 పైన నడుస్తుందని  ద్రువీకరించారు.               

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :