చౌక ధరలో, ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరుతో షావోమి తీసుకొచ్చిన రెడ్మి K20 ప్రో మొదటి ఫ్లాష్ సేల్ : మధ్యాహ్నం 12 గంటలకి

Updated on 22-Jul-2019
HIGHLIGHTS

ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.

షావోమి తన రెడ్మి K20 ప్రో స్మార్ట్ ఫోన్ను ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 48MP ట్రిపుల్ రియర్ కెమేరాతో ఇండియాలో విడుదల చేసింది మరియు ఈ స్మార్ట్ యొక్క మొదట సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్ మరియు మి.కామ్ నుండి జరగనుంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.      

Redmi K20 Pro ధరలు

రెడ్మి K20 ప్రో (6GB + 128GB) ధర – Rs.27,999

రెడ్మి K20 ప్రో (8GB + 256GB) ధర – Rs.30,999                        

Redmi K20 Pro  :  ప్రత్యేకతలు

షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.  ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.          

ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. ఇక ఛార్జింగ్ మరియు బ్యాటరీ విషయాలకు వస్తే,  ఇందులో 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, బాక్స్ లో మాత్రం కేవలం 18వాట్స్ చార్జరును మాత్రమే అందించింది.

అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది. ఇది గరిష్టంగా, 2.84GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది. ఈ ఫోన్ AnTuTu పైన 3,88,803 స్కోరును సాధించినట్లు, షావోమి ప్రకటించింది.  

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్ కెమేరా సెటప్పును  అందించింది. Sony IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 MP  సెల్ఫీ కెమేరా ఒక పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమేరా ఒక కెమేరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం తో వస్తుంది.  ఇది కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లేసియర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :