Redmi 9 Prime: ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చేసింది

HIGHLIGHTS

Redmi 9 Prime భారతదేశంలో బడ్జెట్ ఫోన్ ‌గా మరియు కంపెనీ యొక్క రెడ్‌మి 9 లైనప్ ‌లో లాంచ్ అయ్యింది.

రెడ్‌మి 9 ప్రైమ్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, FHD + స్క్రీన్ మరియు ఎక్కువ పనిచేయగల అధిక సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది.

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ భారతదేశంలో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ రూ .9,999 నుండి ప్రారంభమవుతుంది

Redmi 9 Prime భారతదేశంలో బడ్జెట్ ఫోన్ ‌గా మరియు కంపెనీ యొక్క రెడ్‌మి 9 లైనప్ ‌లో లాంచ్ అయ్యింది. షియోమీ మీ డబ్బుకు తగిన విలువను అందించే విధంగా గట్టి బడ్జెట్ ‌తో తీసుకొచ్చింది మరియు రెడ్‌మి 9 ప్రైమ్ గత నెలలో జూలైలో ప్రారంభించిబడిన రెడ్‌మి 9 మాదిరిగానే ఉంటుంది.

రెడ్‌మి 9 ప్రైమ్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, FHD + స్క్రీన్ మరియు ఎక్కువ పనిచేయగల అధిక సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. రెడ్‌మి 9 ప్రైమ్ యొక్క ఫీచర్లు, ధర మరియు ఇతర వివరాలు గురించి క్లుప్తంగా చూద్దాం.

Redmi 9 Prime Price

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ భారతదేశంలో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ రూ .9,999 నుండి ప్రారంభమవుతుంది మరియు 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి వేరియంట్ రూ .11,999 ధరతో వస్తుంది.

Redmi 9 Prime ఫస్ట్ సేల్

అమెజాన్ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఆగస్టు 6 నుండి రెడ్‌మి 9 ప్రైమ్ అమ్మకానికి వస్తుంది.

Redmi 9 Prime Display ప్రత్యేకతలు

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. అదనపు రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంది. ఈ ఫోన్ కొత్త ఆరా 360 డిజైన్‌ తో అలల ఆకృతితో వస్తుంది, ఇది గ్రిప్పిగా చేస్తుంది మరియు 9.1 మిమీ మందంగా ఉంటుంది మరియు 198 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, సన్‌ రైజ్ ఫ్లేర్ మరియు మాట్టే బ్లాక్ అనే నాలుగు రంగులలో వస్తుంది.

Redmi 9 Prime Performance

ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ ‌సెట్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్‌ తో జతచేయబడుతుంది మరియు ఎంచుకోవడానికి 128 జిబి స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. 512GB వరకు మైక్రో SD కార్డులను ఉపయోగించడం ద్వారా ఫోన్ స్టోరేజ్ ను మరింత పెంచే ఎంపిక కూడా ఉంది.

Redmi 9 Prime Camera

రెడ్‌మి 9 క్వాడ్-కెమెరా సెటప్‌ని  కలిగి ఉంది, ఇందులో ప్రాధమిక 13 MP కెమెరాని ఎఫ్ / 2.2 ఎపర్చరు, 8 MP  అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 5MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్‌ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

Redmi 9 Prime Battery

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, అయితే 10W ఛార్జింగ్ అడాప్టర్ ఇన్-బాక్స్ తో వస్తుంది కాబట్టి వినియోగదారులు అడాప్టర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షియోమి ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందించగలదని పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :