Redmi 9 Power ఫ్లాష్ సేల్: కేవలం బడ్జెట్ ధరలో అతిపెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Redmi 9 Power ఫ్లాష్ సేల్

పెద్ద FHD+ డిస్ప్లే, 48MP క్వాడ్ కెమెరా సెటప్

కేవలం బడ్జెట్ ధరలో అతిపెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్

కేవలం బడ్జెట్ ధరలో అతిపెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్ Redmi 9 Power ఫ్లాష్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం పెద్ద బ్యాటరీ మాత్రమే కాకుండా, పెద్ద FHD+ డిస్ప్లే, 48MP క్వాడ్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా ఇంకా చాలా లేటెస్ట్ మరియు బెస్ట్ ఫీచర్లను కలిగివుంది. Redmi 9 Power యొక్క ధర, స్పెషిఫికేషన్స్ మరియు కంప్లీట్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.     

Redmi 9 Power : ధర

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

రెడ్‌మి 9 పవర్ (4GB ర్యామ్ + 64GB స్టోరేజ్) – Rs.10,999

రెడ్‌మి 9 పవర్ (4GB ర్యామ్ + 128GB స్టోరేజ్) – Rs.11,999

రెడ్‌మి 9 పవర్, బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫియరీ రెడ్ మరియు మైటీ బ్లాక్ అనే నాలుగు కలర్ అప్షన్లతో లభిస్తుంది.

Redmi 9 Power : స్పెషిఫికేషన్లు

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్  బ్రైట్నెస్ అందించగలదు  మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 662 SoC తో పనిచేస్తుంది. ఇది 2.0 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు అడ్రినో 610 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 4GB LPDDR4 (2.1) ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు.  

ఇక కెమెరా విభాగానికి వస్తే, 9 పవర్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఆడియో పరంగా, Hi-Res స్పీకర్లను ఇంద్న్హులో అందించినట్లు షియోమీ తెలిపింది.  

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ 9 పవర్ ఫోన్, అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. అయితే, బాక్సులో మాత్రం 22.5 W ఫాస్ట్ చార్జర్ ను బాక్సుతో పాటుగా ఇస్తునట్లు కంపెనీ తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :