Redmi 9 Power 6GB ర్యామ్ వేరియంట్ కూడా వచ్చేస్తోంది

Updated on 20-Feb-2021
HIGHLIGHTS

Redmi 9 Power యొక్క 6GB ర్యామ్ వేరియంట్.

Redmi 9 Power 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్

9 పవర్ 6GB ఎప్పుడు వస్తుంది.

Redmi 9 Power యొక్క 6GB ర్యామ్ వేరియంట్ కూడా లాంచ్ చెయ్యవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఇప్పటికే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న, ప్రముఖ లీకర్ ఇషాన్ అగర్వాల్ అందించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే అతి త్వరలోనే Redmi 9 Power 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ ను రూ. 12,999 రూపాయల ధరలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

అయితే,ఈ 9 Power 6GB ర్యామ్ వేరియంట్ యొక్క స్పెషిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పులు లేవని కూడా ప్రస్థావించారు.

Redmi 9 Power: స్పెషిఫికేషన్స్

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్  బ్రైట్నెస్ అందించగలదు  మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 662 SoC తో పనిచేస్తుంది. ఇది 2.0 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు అడ్రినో 610 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 4GB LPDDR4 (2.1) ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు. 

ఇక కెమెరా విభాగానికి వస్తే, 9 పవర్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఆడియో పరంగా, Hi-Res స్పీకర్లను ఇంద్న్హులో అందించినట్లు షియోమీ తెలిపింది. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ 9 పవర్ ఫోన్, అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. అయితే, బాక్సులో మాత్రం 22.5 W ఫాస్ట్ చార్జర్ ను బాక్సుతో పాటుగా ఇస్తునట్లు కంపెనీ తెలిపింది.                 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :