Redmi 15C: రెడ్ మీ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ టీజర్ విడుదల చేసిన షియోమీ.!

Updated on 27-Nov-2025
HIGHLIGHTS

రెడ్ మీ 15 సి ఇండియా లాంచ్ టీజర్ షియోమీ ఈరోజు విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో ఈ ఫోన్ టీజర్ విడుదల చేసింది

రోజుకు ఒక ఫీచర్ ను లాంచ్ డేట్ వరకు రివీల్ చేస్తుంది

Redmi 15C : రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 15 సి ఇండియా లాంచ్ టీజర్ షియోమీ ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో ఈ ఫోన్ టీజర్ విడుదల చేసింది. ఇప్పటికే రెడ్ మీ 15 సిరీస్ నుంచి రెడ్ మీ 15G ఫోన్ లాంచ్ చేసిన షియోమీ ఈసారి రెడ్ మీ 15సి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసే టీజర్ పేజీ కూడా షియోమీ రివీల్ చేసింది.

Redmi 15C : లాంచ్ డేట్ ఏమిటి?

రెడ్ మీ 15 సి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 3వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో కూడిన టీజర్ పేజీని అమెజాన్ ఇండియా నుంచి అందించింది. అంటే, ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫీచర్స్ కోసం మాస్క్ ఇమేజ్ ను సెట్ చేసింది. ఈ పేజీ నుండి రోజుకు ఒక ఫీచర్ ను లాంచ్ డేట్ వరకు రివీల్ చేస్తుంది.

Redmi 15C : ఫీచర్స్

రెడ్ మీ 15 సి స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ‘2026 క బిగ్ బాస్’ గా వస్తోందని షియోమీ గొప్పగా చెబుతోంది. ఇలా అనడానికి తగిన ఫీచర్ లు ఈ ఫోన్ లు ఉన్నట్లు తెలిపింది. ఈ ఫీచర్స్ ను రేపటి నుండి ఒక్కొకటిగా రేపటి నుంచి రివీల్ చేస్తుంది.

ఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన టీజర్ పేజీ నుంచి రేపు ఈ ఫోన్ కంప్లీట్ డిజైన్ రివీల్ చేస్తుంది. తర్వాత బ్యాటరీ, డిస్ప్లే మరియు ప్రోసెసర్ వంటి వివరాలు వరుసగా రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ మంచి విజువల్స్ అందించే బిగ్ డిస్ప్లే తో లాంచ్ అవుతుందని రెడ్ మీ చెబుతోంది.

Also Read: Nothing Phone (3a) Lite: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి రెడ్ మీ చేస్తున్న టీజింగ్ చూస్తుంటే, ఈ రెడ్ మీ 14 సి స్మార్ట్ ఫోన్ పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు మల్టీ టాస్కింగ్ వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని మనం ఒక అంచనాకి రావచ్చు. అయితే, కంపెనీ ఈ ఫోన్ వివరాలు వెల్లడించిన తర్వాత మన అంచనా ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :