Redmi 15C 5G with new look and big battery launched in India
Redmi 15C 5G: షియోమీ ఈరోజు రెడ్ మీ 15 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 15సి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ కొత్త లుక్, బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. స్మార్ట్ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
రెడ్ మీ 15 సి స్మార్ట్ ఫోన్ ను షియోమీ మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలను ఈ క్రింద చూడవచ్చు.
రెడ్ మీ 15 సి (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 12,499
రెడ్ మీ 15 సి (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 13,999
రెడ్ మీ 15 సి (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 15,499
డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అయ్యింది మరియు అమెజాన్ తో పాటు షియోమీ రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్ నుంచి కూడా సేల్ అవుతుంది.
Also Read: గొప్ప సౌండ్ అందించే boAt Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైమ్ తక్కువ ప్రైస్ లో లభిస్తోంది.!
రెడ్ మీ 15 సి స్మార్ట్ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, బ్లూ లైట్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు ఇందులో 4 జీబీ నుంచి 8 జీబీ వరకు ర్యామ్ ఆప్షన్ జతగా 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ అందించింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు మూన్ లైట్ బ్లూ, డస్క్ పర్పల్ మరియు మిడ్ నైట్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ లో భారీ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద సౌండ్ అందించే సింగిల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. రెడ్ మీ 15 సి స్మార్ట్ ఫోన్ IP 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.