Redmi 15 5G with 7000 mah long battery and big display
Redmi 15 5G: షియోమీ ఉప బ్రాండ్ రెడ్ మీ నుంచి ఈరోజు బడ్జెట్ షార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, రెడ్ మీ 15 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కంటెంట్ అండ్ గేమింగ్ కు తగిన బిగ్ డిస్ప్లే మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్స్ మరియు మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ రెడ్ మీ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకుందామా.
రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (6 జీబీ + 128 జీబీ) ని రూ. 14,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడిల్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) ని రూ. 15,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. రెడ్ మీ 15 (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ని రూ. 16,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను మిడ్ నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్ మరియు శాండీ పర్పల్ మూడు రంగుల్లో అందించింది.
రెడ్ మీ ఈ ఫోన్ ను సన్నగా ఉండే స్లీక్ డిజైన్ తో అందించింది. అయితే, ఈ ఫోన్ ను కంటెంట్ మరియు గేమింగ్ కోసం తగిన 6.9 ఇంచ్ బిగ్ డిస్ప్లేతో అందించింది. ఈ స్క్రీన్ 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సాధారణ స్మార్ట్ ఫోన్ కంటే పెద్దగా ఉంటుంది. అంతేకాదు, ఇది చూడడానికి వెడల్పు ఉన్నట్లు కనిపిస్తుంది.
రెడ్ మీ 15 స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ లేటెస్ట్ గా అందించిన బడ్జెట్ 5జి చిప్ సెట్ Snapdragon 6s Gen 3 తో వచ్చింది. ఈ ఫోన్ గరిష్టంగా 8 జీబీ ర్యామ్ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ వరకు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Hyper OS2 జతగా ఆండ్రాయిడ్ 15 OS తో అందించింది. ఈ ఫోన్ 2 మేజర్ OS అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ మరియు 200% వాల్యూమ్ మోడ్ తో Dolby సపోర్ట్ కలిగిన సింగల్ స్పీకర్ ఉంటుంది.
ఈ రెడ్ మీ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI Sky, AI Erase, క్లాసిక్ ఫిల్మీ ఫిల్టర్స్ మరియు మరిన్ని Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 18W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ టెక్ కూడా ఈ ఫోన్ లో రెడ్ మీ అందించింది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ వస్తుంది.
Also Read: Dolby Audio సౌండ్ టెక్నాలజీ తో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసిన boAt