Redmi 13C first sale starts from 12pm today
ధమాకా ఆఫర్ తో మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతున్న రెడ్ మి బడ్జెట్ ఫోన్ సేల్. అదే, షియోమి సరికొత్తగా తీసుకు వచ్చిన Redmi 13C స్మార్ట్ ఫోన్. రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ ను గత వారం మార్కెట్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలో 50MP ట్రిపుల్ కెమేరా, ఫాస్ట్ ప్రోసెసర్ మరియు విలక్షణమైన డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలువుతుంది.
రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ ను రూ. 8,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది స్టార్టింగ్ వేరియంట్ అయిన 4GB + 128GB కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క మరో రెండు వేరియంట్స్ అయిన 6GB + 128GB మరియు 8GB + 256GB ధరలను రూ. 9,999 మరియు రూ. 11,999 గా ప్రకటించింది.
ఈ ఫోన్ పైన ధమాకా ఆఫర్లను కూడా షియోమి అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ICICI, SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ EMI ద్వారా కొనే వారికి రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను ఈ బ్యాంక్ ఆఫర్ తో 1,000 రూపాయల తక్కువ ధరకే మీరు ఈరోజు అందుకోవచ్చు.
Also Read : Gold Price: ఈ నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2 వేలు తగ్గిన బంగారం ధర.!
ఈ ఫోన్ ను అమేజాన్, mi.com మరియు mi అవుట్ లెట్స్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు.
రెడ్ మి 13సి అందమైన సన్నని డిజైన్ తో వచ్చింది మరియు స్టార్ గ్రీన్ & స్టార్ డస్ట్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Helio G85 ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB వరకూ RAM సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో అనువైన 7 క్లాసిక్ ఫిల్టర్స్ సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ కెమేరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీని, 8MP సెల్ఫీ కెమేరాని మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంది.