Redmi 13 5G: 108MP కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

రెడ్ మీ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది

Redmi 13 5G ను షైనీ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ ఆటపట్టిస్తోంది

ఈ షియోమీ ఫోన్ 108MP కెమెరాతో వస్తుంది

Redmi 13 5G: రెడ్ మీ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది. రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల, జూలై 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ ను 108MP కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో పాటు స్లీక్ అండ్ షైనీ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ ఆటపట్టిస్తోంది.

Redmi 13 5G

రెడ్ మీ 12 5జి ఫోన్ నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ రెడ్ మీ 13 5జి లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఫోన్ లకు గట్టి పోటీగా తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా రెండు వారలు ఉండగా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లతో కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది.

Redmi 13 5G Camera

ఈ ఫోన్ ను అమెజాన్ నుండి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ సేల్ పార్ట్నర్ అని కన్ఫర్మ్ చేసినట్లే అవుతుంది. ఈ మైక్రో సైట్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్లను వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్, ప్రొసెసర్ తో పాటు కెమెరా వివరాలను కూడా ఈ షియోమీ వెల్లడించింది.

Also Red: పెద్ద స్క్రీన్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో కొత్త Projectors లాంచ్ చేస్తున్న Zebronics

Redmi 13 5G: ఫీచర్లు

రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో తీసుకు వస్తోందిట. ఇది చూడటానికి చాలా అందంగా మెరుస్తూ స్లీక్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 తో వస్తుంది. ఈ ఫోన్ లో సన్నని అంచులు మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన పెద్ద డిస్ప్లే వుంది. ఈ ఫోన్ లో 5030 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా షియోమీ తెలిపింది.

రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ షియోమీ హైపర్ OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణలో ఉంటుంది మరియు వెనుక కూడా గ్లాస్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :