ఫ్లిప్ కార్ట్ బిగ్ బియన్ డేస్ సేల్ నుండి Redmi 10 పైన ఎన్నడూ చూడనంత భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇటీవల షియోమీ ఇండియాలో విడుదల చేసిన ఈ Redmi 10 భారీ ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మునుపెన్నడూ చూడనంత అతిభారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ ఫోన్ భారీ 6,000 mAh భారీ బ్యాటరీ, 50MP AI కెమెరా వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన మంచి బ్యాంక్ అఫర్ ను కూడా అందించింది. మరి Redmi 10 పైన ఫ్లిప్ కార్ట్ అందించి ఆ ఆఫర్లు ఎమిటో చూద్దామా.
ఇక రెడ్ మీ 10 ప్రో యొక్క 4GB+64GB వేరియంట్ రూ.10,999 ధరతో లాంచ్ కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి కేవలం రూ.8,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డెబిట్ కార్డ్ EMI అఫర్ ద్వారా కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
ముందుగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను చూస్తే, రెడ్ మీ 10 పెద్ద 6.71 ఇంచ్ HD రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Widevine L1 సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణతో పాటుగా 2GB వరకూ వర్చువల్ RAM ను కూడా పొందుతారు.
కెమెరాల పరంగా, ఈ ముసార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ వుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది (కానీ బాక్స్‌లో 10W అడాప్టర్ మాత్రమే వస్తుంది). ఈ షియోమీ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా MIUI 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.