5G సపోర్టుతో రానున్న REDMI K 30 : Lu Weibing

Updated on 26-Aug-2019
HIGHLIGHTS

లు వీబింగ్ తన Weibo పేజీలో ఈ ప్రకటన వెల్లడించారు.

ఇండియాలో విడుదల చేసినప్పటి నుండి, రెడ్మి K 20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు, మార్కెట్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలచాయి. ఇప్పుడు, కె 20 వారసునిగా తన అంబుల పొందనుండి మరొక బాణాన్ని సాధించడానికి, రెడ్మి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రెడ్మి కె 20 యొక్క 5 జి వారసుడు త్వరలో రానున్నట్లు అధికారికంగా వెల్లడైంది, దీనిని రెడ్మి K 30 అని పేర్కొంటోంది. ఆగస్టు 25 న రెడ్మి జనరల్ మేనేజర్ అయిన, లు వీబింగ్ తన Weibo పేజీలో ఈ ప్రకటన వెల్లడించారు.

K 20 యొక్క వారసుడి పేరును ప్రకటించడానికి వీబింగ్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ Weibo ను వాడారు. రెడ్మి కె 30 ఫోనుకి  5 జి సపోర్ట్ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇది చాలా మంచి వార్త అయినప్పటికీ, రెడ్మి K 30 గురించి ప్రస్తుతం మరింత సమాచారం పెద్దగా తెలియదు. అలాగే, ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ను కూడా కంపెనీ ఇంకా ధృవీకరించలేదు, అయినప్పటికీ, అది మే 2020 వరకూ ఎప్పుడైనా ప్రారంభించబడుతుందని అంచనావేస్తున్నారు.

రెడ్మి కె 30 లో 4 జి మరియు 5 జి మోడల్స్ ఉన్నాయా లేదా 5 జి వెర్షన్ మాత్రమే ఉంటుందో మనకు తెలియదు. అయితే, రెడ్మి కె 30 రెండు కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. ఈ పరికరం రెడ్‌మి కె 20 సిరీస్ మాదిరిగానే మంచి వ్యూహాన్ని అనుసరిస్తుందని మరియు ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

రెడ్‌మి కె 20 సిరీస్‌లో 3 డి కర్వ్డ్ ఆర్క్ బాడీ మరియు ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి, ఇవి పాప్-అప్ మాడ్యూల్‌లో ఉన్నాయి. కె 20 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్ చేత శక్తినివ్వగా, షావోమి రెడ్మి కె 20 మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC ని కలిగి ఉంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 1080 x 2340 పి రిజల్యూషన్‌తో 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే ఉంటుంది. ఇవి గేమ్ టర్బో టెక్నాలజీని కూడా కలిగి ఉన్నాయి, ఇది గేమింగ్, నెట్‌వర్క్, టచ్ రెస్పాన్స్ మరియు విజువల్స్‌ను మెరుగుపరుస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :