Realme X7 Max 5G: ఇండియాలో లాంచ్ కి రెడీ

Updated on 24-May-2021
HIGHLIGHTS

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ లాంచ్

మీడియా టెక్ డైమెన్సిటీ 1200 5G చిప్ సెట్ తో వస్తున్న మొదటి ఫోనుగా ఈ రియల్మి X7 మ్యాక్స్ 5G

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ ను మే 31 న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1200 5G చిప్ సెట్ తో వస్తున్న మొదటి ఫోనుగా ఈ రియల్మి X7 మ్యాక్స్ 5G నిలుస్తుంది. ఈ ఫోన్ గురించిన కొన్ని స్పెషిఫికేషన్లను కూడా  కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి, ఈ నెల మొదట్లోనే ఈ X7 మ్యాక్స్ 5G కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యాల్సివుండగా, భారతదేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా దీని వాడిదా వేసింది. ఇపుడు ఈ నెల చివరికి  విడుదల చేస్తోంది.

రియల్మి CEO మాధవ్ సేథ్ ముందే ఈ ఫోన్ గురించి టీజ్ చేసారు. ఆ టీజింగ్ నుండి ఈ ఫోన్ వెనుక భాగం డ్యూయల్ టోన్ గ్రేడియంట్  ఫినిషింగ్ తో వుంది. అయితే, వాస్తవానికి ఈ X7 మ్యాక్స్ 5G స్మార్ట్ ఫోన్ Realme GT నియో కావచ్చని కూడా ఈ ఫోటోలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క ధర వివరాలను కూడా రియల్మి సూచించింది. ఈ రియల్మి X7 మ్యాక్స్ 5G బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999 రూపాయల ప్రారంభ ధరతో, మరొక వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB వేరియంట్ ని రూ.30,999 ధరతో సూచించింది.                           

ఇక Realme అధికారిక వెబ్సైట్ నుండి అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ గరిష్టంగా 1000 నైట్స్ బ్రైట్నెస్ అందించ గల 100% DCI-P3 వైడ్ కలర్ గ్యాముట్ Super AMOLED డిస్ప్లే ని ఈ ఫోన్ లో అందించింది. ఇది 120Hz అల్ట్రా స్మూత్ రిఫ్రెష్ రేట్ 360 Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ తో వుంటుంది. ఈ ఫోన్ ను 50W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు సన్నని డిజైన్ తో తీసుకువస్తోంది.

Realme X7 Max 5G కెమెరా సెటప్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోనులో వెనుక 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులోని మైన కెమెరాని SonyIMX682 సెన్సార్ తో ఇచ్చింది. దీనికి జతగా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 2MP మ్యాక్రో సెన్సార్ ని ఇచ్చింది.                             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :