ఇండియాలో మొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ ఖ్యాతి ఇక రియల్మీకె దక్కుతుంది

Updated on 18-Feb-2020
HIGHLIGHTS

రియల్మీ X50 ప్రో 5G ఫోన్ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు తేదీని ప్రకటించింది.

రియల్మీ సంస్థ, ముందు నుండి ఊరిస్తున్న Realme X50 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ డేట్ ని ప్రకటించింది. అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. అదేమిటంటే, ఇండియాలో మొదటి 5G స్మార్ట్ ఫోన్నుఫిబ్రవరి 25 వ తేదికి లాంచ్ చేయనున్నట్లు IQOO ప్రకటించిన తరువాత, రియల్మీ దాని కంటే ఒక రోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 24 వతేదీకి తన రియల్మీ X50 ప్రో 5G  ఫోన్ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు తేదీని ప్రకటించింది.

 

https://twitter.com/TheMrPhone/status/1229643860567117824?ref_src=twsrc%5Etfw

 

ఈ ఫోనుకు సంబంధించిన లాంచ్ డేట్ ను తన అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా టీజ్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ను వెనుక క్వాడ్ రియర్ కెమేరా మరియు ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో అంటే మొత్తంగా 6 కెమేరాలతో లాంచ్ చేయనున్నట్లు కూడా ప్రకటిస్తోంది. వీటితో పాటుగా, ఈ కెమెరాకి సంభంచి సూపర్ ఫీచరుగా దీని తో చెయ్యగల జూమ్ గురించి కూడా చెబుతోంది. దీని ప్రకారం, ఈ ఫోనులో అందించిన కెమేరాతో 20X వరకూ జూమ్ చేసుకోవచ్చని సంస్థ అందించిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

ఇక ఈ లాంచ్ ఈవెంట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క విడుదల కోసం సంస్థ యొక్క యూట్యూబ్ ఛానల్ ల్లో ప్రకటించిన LIVE ప్రోగ్రాం ప్రకారం ఇది న్యూ ఢిల్లీలో జరగనుంది. కాబట్టి, IQOO ప్రకటించిన IQOO3 5G స్మార్ట్ ఫోన్ కంటే ఈ ఫోన్ ఒక్క రోజు ముందుగా ఇండియాలో లాంచ్ అవుతుందని అధికారికంగా తెలుస్తుంది కనుక రియల్మీ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ విడుదలైన తరువాత ఇండియాలో మొట్టమొదటి 5G సామ్రాట్ ఫోనుగా నిలుస్తుంది.                                             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :