ఇండియాలో మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు విడుదల కానుంది : Realme X50 Pro 5G

Updated on 24-Feb-2020

ఇప్పటికే చాలా దేశాల్లో 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే, ఈ రోజు నుండి ఇండియా కూడా ఈ లిస్ట్ లో భాగం కానుంది. ఎందుకంటే, ఈరోజు రియల్మీ సంస్థ విడుదల చేయనున్న ఈ Realme X50 Pro 5G స్మార్ట్ ఫోన్ 5G సపోర్టుతో ఇండియాలో విడుదల కానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోను కాబట్టి. అంతేకాదు, స్నాప్ డ్రాగన్ 865 చిప్సెట్ తో విడుదలకానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ ఫోన్ యొక్క విడుదల కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2:30 నిముషాలకు ప్రారంభించనుంది. ఈ కార్యరాక్రమం LIVE లో చుడడానికి, రియల్మీ యొక్క అధికారిక యుట్యూబ్ ఛానల్ నుండి చూడవచ్చు. మీరు నేరుగా చూడాలనుకుంటే, ఈ క్రింద చూడవచ్చు.

ఇక ఈ ఫోన్ యొక్క కొన్ని ప్రత్యేకతలు(స్పెక్స్) ని రియల్మీ ఇప్పటికే ప్రకటించింది మరియు టీజ్ చేస్తుంది వాటిలో, డ్యూయల్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక క్వాడ్ కెమేరాతో మొత్తంగా 6 కెమెరాలతో విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించింది. అయితే, ప్రస్తుత ట్విట్టర్ ద్వారా టీజ్ చేస్తున్న ఇమేజిలను చూస్తుంటే, ఇది 64MP AI క్వాడ్ కెమేరాతో ఈ ఫోన్ తీసుకువస్తునట్లు భావిస్తున్నారు. అలాగే, ఈ ఇమేజిలను చూస్తుంటే, ఇందులో అందించిన కెమేరా అద్భుతమైన ఫోటోలను తియ్యగలదని కూడా ఊహిస్తున్నారు.   

పైన తెలిపిన వివరాలతో పాటుగా,  ఈ స్మార్ట్ ఫోనులో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందించినట్లు ప్రకటించింది. దీని గురించి, ఇది 65W సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీగా చెబుతోంది. ఇటీవల రియల్మీ నుండి ఒక 50W Super Vooc ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చినటువంటి రియల్మీ X2 ప్రో రియల్ టైం ఛార్జింగ్ స్టేటస్ ని చూపిస్తే, ఇక ఇప్పుడు రియల్మీ ప్రకటించిన ఈ 65W సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీ మరింకెంత ఫాస్ట్ గా ఛార్జ్ చేస్తుందో అని చర్చిసున్నారు.                                                                 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :