Realme X3 అన్నివివరాలు విడుదల కంటే ముందే ఆన్లైన్లో లీకయ్యాయి

Updated on 06-Jun-2020
HIGHLIGHTS

లీకైన Realme X‌3 స్పెక్స్

ఇది హార్డ్వేర్ పరంగా Realme X 3 Super Zoom ని పోలివుంది.

రాబోయే రియల్‌మి ఎక్స్ 3 కీ-స్పెక్స్ వెల్లడించారు

Realme X ‌3 మరోసారి లీక్స్ ద్వారా కనిపించింది మరియు ఇది అధికారికంగా విడుదలవ్వడాని కంటే  ముందుగానే ఈ ఫోన్ గురించిన చాలా వివరాలను  వెల్లడించింది. రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌ జూమ్‌ గత వారం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ఇప్పుడు రియల్‌మి ఎక్స్‌2 స్థానంలో కంపెనీ కొత్త స్మార్ట్ ‌ఫోన్‌ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

రియల్‌మి గతంలో Google Play కన్సోల్ జాబితాలో కనిపించింది. తదనంతరం, ప్రసిద్ధ టిప్స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్లో రాబోయే రియల్‌మి ఎక్స్ 3 కీ-స్పెక్స్ వెల్లడించారు మరియు ఇది హార్డ్వేర్ పరంగా Realme X 3 Super Zoom తో సరిపోతుంది.

లీకైన Realme X ‌3 స్పెక్స్

MySmartPrice రిపోర్ట్ మరియు ముకుల్ ట్వీట్ ప్రకారం, ఈ Realme X‌ 3 ఒక 6.6-అంగుళాల FHD + డిస్ప్లే లభిస్తుంది మరియు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ ఇవ్వబడుతుంది.

అలాగే, ఈ Realme X‌ 3 వేగవంతమైన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ తో నడిచే ఫోనుగా‌ ఉంటుంది. ఇది రియల్‌మి ఎక్స్‌ 2 లో కనిపించే మధ్య-శ్రేణి స్నాప్‌డ్రాగన్ 730 చిప్‌సెట్ ‌కి పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది 12GB RAM మరియు 256GB స్టొరేజితో జత చేయబడుతుంది. అయితే, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌సెట్ తో రావచ్చని, మునుపటి లీక్స్ వెల్లడించాయి. సరైన సమాచారం కోసం,ఈ ఫోన్ అధికారికంగా ప్రకటించేవరకూ వేచి చూడాల్సి వుంటుంది.

Realme X‌ 3 లో వెనుక క్వాడ్-కెమెరా సెటప్ ఉంటుంది. ఈ వెనుక కెమెరాకు 64MP  ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్-కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ (2 X ఆప్టికల్ జూమ్‌తో) మరియు 2 మెగాపిక్సెల్ Macro కెమేరా లభిస్తాయి. ఈ ఫోన్ ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. వాటిలో ఒకటి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు మరొకటి 8 ఎంపి సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ సెన్సార్.

బ్యాటరీకి సంబంధించినంతవరకు, రియల్‌మి ఎక్స్‌ 3‌ ఒక 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సహకరిస్తుందని, ఈ లీక్స్  ద్వారా తెలుస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :