Realme X7 Max 5G: గొప్ప ఫీచర్లతో వస్తోంది

HIGHLIGHTS

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది

రియల్మి X7 మ్యాక్స్ 5G డైమెన్సిటీ 1200 5G చిప్ సెట్ తో వస్తున్న మొదటి ఫోను

100% DCI-P3 వైడ్ కలర్ గ్యాముట్ Super AMOLED డిస్ప్లే

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది. ఇప్పుడు దీనికి సంభంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా  వెల్లడించింది. రియల్మి X7 మ్యాక్స్ 5G స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 1200 5G చిప్ సెట్ తో వస్తున్న మొదటి ఫోనుగా నిలుస్తుంది.  నిలుస్తుంది. మే 31 న మధ్యాహ్నం 12:30 గంటకు ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది.   

ఈ ఫోన్ వెనుక భాగం డ్యూయల్ టోన్ గ్రేడియంట్  ఫినిషింగ్ తో వుంది. అయితే, వాస్తవానికి ఈ X7 మ్యాక్స్ 5G స్మార్ట్ ఫోన్ Realme GT నియో కావచ్చని కూడా ఈ ఫోటోలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క ధర వివరాలను కూడా రియల్మి సూచించింది. ఈ రియల్మి X7 మ్యాక్స్ 5G బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999 రూపాయల ప్రారంభ ధరతో, మరొక వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB వేరియంట్ ని రూ.30,999 ధరతో సూచించింది.                           

ఇక Realme అధికారిక వెబ్సైట్ నుండి అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ గరిష్టంగా 1000 నైట్స్ బ్రైట్నెస్ అందించ గల 100% DCI-P3 వైడ్ కలర్ గ్యాముట్ Super AMOLED డిస్ప్లే ని ఈ ఫోన్ లో అందించింది. ఇది 120Hz అల్ట్రా స్మూత్ రిఫ్రెష్ రేట్ 360 Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ తో వుంటుంది. ఈ ఫోన్ ను 50W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు సన్నని డిజైన్ తో తీసుకువస్తోంది.

Realme X7 Max 5G కెమెరా సెటప్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోనులో వెనుక 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులోని మైన కెమెరాని SonyIMX682 సెన్సార్ తో ఇచ్చింది. దీనికి జతగా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 2MP మ్యాక్రో సెన్సార్ ని ఇచ్చింది.                            

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :