ఇండియాలో Realme 9 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్ నుండి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ల పత్యేకతల గురించి ఒక్కొక్కటిగా కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ సిరీస్ నుండి Realme 9 Pro+ మరియు Realme 9 Pro స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువస్తుంది. ఈ ఫోన్ యొక్క ఒక ప్రత్యేకమైన ఫీచర్ గురించి కంపెనీ CEO మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ హార్ట్ రేట్ సెన్సార్ తో వస్తున్నట్లు ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
https://twitter.com/MadhavSheth1/status/1488380400171089920?ref_src=twsrc%5Etfw
Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుందని, ఇది హార్ట్ రేట్ ను స్కానర్ కూడా పనిచేస్తుందని మాధవ్ సేథ్ ధ్రువీకరించారు. దీనికోసం, వినియోగదారులు వారి వేలును స్కానర్ పైన నొక్కిపట్టి ఉంచిన తరువాత రీడింగ్స్ ని స్క్రీన్ పైన చూడవచ్చని తెలిపారు.
ఇక Realme 9 Pro+ మరిన్ని వివరాల కోసం చూస్తే, ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 119-డిగ్రీ FOVతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Realme 9 Pro+ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.