Realme P4 Power 5G: సింగల్ డే భారీ ఆఫర్స్ తో ఫస్ట్ డే సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

Updated on 04-Feb-2026
HIGHLIGHTS

రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ పి4 పవర్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

Realme P4 Power 5G 10001 mAh బిగ్ బ్యాటరీతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

ఫస్ట్ డే సేల్ నుంచి లభించే సింగిల్ డే భారీ డీల్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరలో లభిస్తుంది

Realme P4 Power 5G: రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ పి4 పవర్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఇండియాలో 10,001 mAh బిగ్ బ్యాటరీతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా రియల్‌మీ పి4 పవర్ చరిత్రలో తన పేరు నమోదు చేసింది. ముఖ్యంగా, ఈ ఫోన్ కలిగిన గొప్ప ఫీచర్స్ తో కూడా కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో రావడం విశేషం. ఇది కాకుండా ఫస్ట్ డే సేల్ నుంచి ,లభించే సింగిల్ డే భారీ డీల్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరలో లభిస్తుంది.

Realme P4 Power 5G: ప్రైస్

రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో వచ్చింది. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ రూ. 27,999 ధరతో, మిడ్ (8GB + 256GB) వేరియంట్ రూ. 29,999 ధరతో మరియు హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ రూ. 32,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ పై ఫస్ట్ డే సేల్ కోసం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా కంపెనీ అందించింది.

ఆఫర్స్

ఈ ఫోన్ లాంచ్ ఆఫర్స్ లో భాగంగా సింగల్ డే ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రకటించింది. అంటే, రేపు జరిగే సేల్ ఒక్కరోజు మాత్రమే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై మొత్తం మూడు ఆఫర్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో మొదటిది ఈ ఫోన్ పైన అందించిన రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. Axis, ICICI, HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

రెండోది ఈ ఫోన్ పై అందించిన రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. పీత ఫోన్ తో ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా తీసుకునే వారికి ఈ బోనస్ లభిస్తుంది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ పై అందించిన రూ. 1,000 రూపాయల ప్రత్యేకమైన లాయల్టీ బోనస్ మూడు ఆఫర్ అవుతుంది. ఇది కాకుండా రూ. 999 రూపాయలకే ఎక్స్ ప్లోర్ ప్యాక్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ప్యాక్ లో భాగంగా Buds T200 Lite, అడ్వెంచర్ బ్యాక్ ప్యాక్ మరియు 4 ఇయర్ బ్యాటరీ వారంటీ అందుకోవచ్చు.

Also Read: చవక ధరలో 5.2 Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ మిస్ అవ్వకండి.!

Realme P4 Power 5G: ఫీచర్స్

రియల్‌మీ పి4 పవర్ 6.79 ఇంచ్ బిగ్ 4D కర్వుడ్ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 6500 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ తో పాటు Netflix HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే కోసం హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ను కూడా అదనంగా అందించింది. ఈ రియల్‌మీ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8 జీబీ / 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 50MP ప్రధాన సెన్సార్ జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ 30FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప AI ల్యాండ్ స్కేప్ ఫోటోలు అందిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముఖ్యమైన ఫీచర్ ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ. ఎందుకంటే, ఈ ఫోన్ ను 10001 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ తో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ ఒక బ్యాటరీ సెంట్రిక్ ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ 80 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. IP68 మరియు IP69 రేటింగ్ తో ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :