Realme P4 5G: రూ. 3,500 భారీ ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన సేల్.!

Updated on 25-Aug-2025
HIGHLIGHTS

రియల్ మీ పి4 5జి ఈరోజు మొదటి సేల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది

ఫస్ట్ డే సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్ల కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈరోజు ఈ ఫోన్ పై రూ. 3,500 భారీ తగ్గింపు అందుకోవచ్చు

Realme P4 5G: రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4 5జి ఈరోజు మొదటి సేల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఫస్ట్ డే సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్ల కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ సింగల్ డే బెస్ట్ లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈరోజు ఈ ఫోన్ పై రూ. 3,500 భారీ తగ్గింపు అందుకోవచ్చు.

Realme P4 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

రియల్ మీ పి4 5జి స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ తో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ధర వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

  • రియల్ మీ పి4 (6GB + 128GB) ధర రూ. 18,499
  • రియల్ మీ పి4 (8GB + 128GB) ధర రూ. 19,499
  • రియల్ మీ పి4 (8GB + 256GB) ధర రూ. 21,499

ఈ ఫోన్ ను ఇంజిన్ బ్లూ, ఫోర్జ్ రెడ్ మరియు స్టీల్ గ్రే మూడు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు అనగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య సమయంలో కొనుగోలు చేసే వారి కోసం సింగిల్ డే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

ఏమిటా ఆఫర్లు?

ఈ ఫోన్ ఫస్ట్ డే సింగల్ డే ఆఫర్స్ లో భాగంగా రెండు ఆఫర్లు అందించింది. అవేమిటంటే, సెలెక్టెడ్ బ్యాంక్ యొక్క డెబిట్ / క్రెడిట్ కార్డు పై రూ. 2,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను ఈ క్రింద తెలిపిన ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

  • రియల్ మీ పి4 (6GB + 128GB) ధర రూ. 14,999
  • రియల్ మీ పి4 (8GB + 128GB) ధర రూ. 15,999
  • రియల్ మీ పి4 (8GB + 256GB) ధర రూ. 17,499

అయితే, ఈ ఆఫర్స్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈరోజు మాత్రమే ఈ ఆఫర్ ప్రైస్ లో లభిస్తాయని గమనించాలి.

Also Read: కేవలం రూ. 4,000 ధరలో కంప్లీట్ సెటప్ తో వచ్చే బెస్ట్ 120W Soundbar లు ఇవే.!

Realme P4 5G: ఫీచర్స్ ఏమిటి?

రియల్ మీ ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ 7.58mm మందంతో చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 ఆక్టా కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో విజువల్స్ కోసం ప్రత్యేకమైన హైపర్ విజన్ AI చిప్ ను కూడా అందించింది. ఈ ఫోన్ రియల్ మీ UI 6.0 ఫాస్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

డిస్ప్లే మరియు కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్
AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉంటుంది. ఇది 60Hz -144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 4500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ కూడా రియల్ మీ అందించింది. ఇందులో
50MP + 8MP + మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా అందించింది.

ఈ ఫోన్ 30FPS వద్ద స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. AI ఎడిట్ జీనీ, AI ల్యాండ్ స్కేప్, AI ఎరేజర్ వంటి మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో రియల్ మీ అందించింది. ఈ రియల్ మీ కొత్త ఫోన్ IP65 మరియు IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ కలిగి ఉన్నా కూడా 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :