Realme P3 Ultra 5G could offer double performance under budget price
Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది. గత నెలలో P3 Series ఫోన్ లను రియల్ మీ పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ పి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 8350 తో లాంచ్
చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ 800K+ AnTuTu స్కోర్ అందించే స్మార్ట్ ఫోన్స్ లభించే ప్రైస్ సెగ్మెంట్ లో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే అవుతుందని టీజింగ్ చేస్తోంది. ఎందుకంటే, ఈ ఫాలెన్ కలిగిన చిప్ సెట్ 14,50,000+ AnTuTu స్క్రీన్ అందిస్తుంది. అందుకే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ అని టీజింగ్ చేస్తోంది.
ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు UFS 3.1 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 80W AI బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఇక ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో, 50MP Sony IMX896 OIS మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 60FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా చాలా స్లీక్ గా ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లోనే Dolby Atmos Soundbar అందుకోండి.!
రియల్ మీ పి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కాస్మిక్ స్టార్ రింగ్ డిజైన్, నెప్ట్యూన్ బ్లూ మరియు ఓరియన్ రెడ్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ తో కూడా వస్తుంది. అంతేకాదు, 90FPS BGMI స్టేబుల్ గేమింగ్ కూడా ఆఫర్ చేస్తుందట.