Realme P1 Pro 5G with curved display launching under 20k in india
Realme P1 Pro 5G: ఇండియన్ మార్కెట్ లో అతివేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న కంపెనీలలో రియల్ మి ఒకటి. ఇప్పుడు కూడా కొత్త ఫోన్ లాంఛ్ చేయడానికి సిద్దమయ్యింది. రియల్ మి పి1 సిరీస్ ను కంపెనీ కొత్తగా పరిచయం చేస్తోంది. ఈ సిరీస్ నుండి రియల్ మి పి1 మరియు పి1 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ల యొక్క ఫీచర్ లతో పాటుగా ఎక్స్ పెక్టెడ్ ధర వివరాలతో కూడా టీజింగ్ మొదలు పెట్టింది. ఇందులో ప్రో వెర్షన్ స్మార్ట్ ఫోన్ ను Curved Display తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
రియల్ మి ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. రియల్ మి అప్ కమింగ్ సిరీస్ నుండి లాంఛ్ చేయబోతున్న రెండు ఫోన్ లలో ప్రో ఫోన్ ను 20 వేల రూపాయల సబ్ కేటగిరిలో కర్వ్డ్ డిస్ప్లే తో లాంఛ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే, బేసిక్ వేరియంట్ ఫోన్ పి1 ను మాత్రం వేగవంతమై చిప్ సెట్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
అంతేకాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క చాలా ఫీచర్లను కూడా రియల్ మీ ముందే వెల్లడించింది. రియల్ మీ పి1 ప్రో 5g స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ కలిగిన Pro-XDR AMOLED కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 2000 పీక్ బ్రైట్నెస్ మరియు TUV సెర్టిఫైడ్ తో వస్తుంది.
Also Read: Noise మరియు Fire-Boltt Smart Watch ల పైన అమెజాన్ భారీ ఆఫర్లు.!
ఈ సిరీస్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఆక్టా కోర్ ప్రాసెస్ ను కలిగి ఉన్నట్లు కూడా రియల్ మీ వెల్లడించింది. ఇది మాత్రమే కాదు ఈ సిరీస్ ఫోన్లలో 45 వాట్ చార్జింగ్, మంచి కూలింగ్ సిస్టం మరియు రెయిన్ వాటర్ టచ్ ఫీచర్స్ ఉన్నట్లు కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది.