Realme C 11 వివరాలు లీక్, ప్రీమియం ఫోన్ల వంటి Camera మోడ్యూల్ తో రావచ్చు

Updated on 24-Jun-2020
HIGHLIGHTS

Realme C 11 ఫోన్ గురించి ఆన్లైన్లో వచ్చిన లీక్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ డిజైన్ కనిపించింది.

Realme C11 స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ Helio G 35 ప్రాసెసర్‌తో వస్తుంది.

Realme యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా అందరికీ పరిచయమున్న, C సిరీస్ నుండి త్వరలోనే కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ Realme C 11 ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ Helio G 35 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇప్పుడు, ఈ ఫోన్ గురించి ఆన్లైన్లో వచ్చిన లీక్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ డిజైన్ కనిపించింది. రియల్‌మి ఇటీవల కొన్ని ఫోటోలను టీజర్‌లుగా ప్రచురించింది. ఈ చిత్రాలలో ఒకదానిలో, ఈ ఫోన్ వెనుక ప్యానెల్ చూడవచ్చు కాని కెమెరాను కప్పి ఉంచారు. ఇప్పుడు ఒక ట్విట్టర్ యూజర్, త్వరలో రాబోయే ఈ Realme C 11 యొక్క చిత్రాన్ని ప్రచురించాడు, ఇది ఫోన్ డిజైన్ మరియు కొన్ని ప్రధాన స్పెక్స్ ‌లను వెల్లడించింది.

లీకైన Realme C11 ఇమేజ్‌లో ముందుభాగం కనిపించింది మరియు దీనికి క్లాసిక్ డిజైన్ ఇవ్వబడింది మరియు డిస్ప్లే పైన డ్రాప్ ఆకారపు గీత కనిపిస్తుంది. దిగువ ఫ్రేమ్ కొద్దిగా మందంగా ఉండగా ఈ స్మార్ట్ ఫోనుకు సన్నని అంచు ఇవ్వబడింది.

Pixel 4 మరియు iPhone 11 సిరీస్‌లలో మనం చూసినట్లుగా స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఈ Realme C 11 వెనుక భాగంలో ఇవ్వబడింది. కెమెరా సెటప్‌లో LED  ఫ్లాష్‌తో రెండు సెన్సార్లు ఇవ్వబడ్డాయి. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి ఎటువంటి గుర్తులు కనుగొనబడలేదు, కాబట్టి కంపెనీ దాన్ని తీసివేసిందని లేదా సైడ్-మౌంటెడ్ స్కానర్ ఈ ఫోనులో ఇస్తుందని భావిస్తున్నారు.

Realme C11 స్మార్ట్ ‌ఫోన్‌కు,  6.5 అంగుళాల స్క్రీన్ లభిస్తుందని, ఈ ఫోన్‌కు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనుందని, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడుతుందని ఈ పోస్టర్ తెలిపింది. ఇది కాకుండా, డ్యూయల్ కెమెరా నైట్‌స్కేప్ మోడ్‌తో వస్తుంది. 3.5 MM ఆడియో జాక్‌తో ఈఫోన్ తీసుకురాబడుతుంది. ఈ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయవచ్చు మరియు మొదట మలేషియాలో జూన్ 30న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్,  బూడిద మరియు ఆకుపచ్చ రంగులలో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :