ఇండియాలో Realme Narzo సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

Updated on 07-May-2020
HIGHLIGHTS

Live Stream ద్వారా ఈ నార్జో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు రియల్మి ప్రకటించింది.

ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్నటువంటి  Realme స్మార్ట్ ఫోన్ సంస్థ, తన కొత్త స్,మార్ట్ ఫోన్ సిరీస్ ను ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ను ప్రకటించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అనేకసార్లు వాయిదాపడిన Narzo సిరీస్ స్మార్ట్ ఫోన్ల విడుదల తేదీని ఎట్టకేలకు ఖాయమా చేసింది. మే 11 న Live Stream ద్వారా ఈ నార్జో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు రియల్మి ప్రకటించింది. వాస్తవానికి,  ఇప్పుడు లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేయబడినందున, స్మార్ట్ ఫోన్ లాంచ్ తో పాటుగా దేశంలోని గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో అమ్మకాలను సాగించనుంది. నార్జో సిరీస్ ‌లో రెండు హ్యాండ్‌సెట్ ‌లు ఉంటాయి, అవి Narzo 10 మరియు Narzo 10 A.

రియల్మి పంపిన మెయిల్ కూడా ఇదే చెబుతోంది.  రియల్మి నుండి కొత్తగా ఉత్పత్తి చేయబడిన స్మార్ట్ ఫోన్ల యొక్క లాంచ్ కోసం  ఎదురుచూస్తున్నట్లు, మే 11 న రియల్మి నార్జో 10 & రియల్మి నార్జో 10 ఎ యొక్క డిజిటల్ లాంచ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషిస్తునట్లు మరియు ప్రీమియం, పనితీరుతో నడిచే, సరసమైన ఈ స్మార్ట్ ‌ఫోన్లతో కొత్త అనుభవాన్ని  తీసుకొస్తున్నట్లు చెబుతోంది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలోస్మార్ట్‌ ఫోన్ డెలివరీని యాక్సెస్ చేయగలిగినందున, నార్జో 10 & నార్జో 10 ఎ యొక్క క్రొత్త అనుభవాన్ని మీ ఇంటి వద్దకు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది ” అని చెబుతోంది.

రియల్మి నార్జో 10 ప్రత్యక్ష ప్రసారం: ఎలా చూడాలి

మీరు 12:30 P.M.  ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడే రియల్మి మార్జో 10 మరియు రియల్మి నార్జో 10A స్మార్ట్‌ ఫోన్ల లాంచ్ వీడియోను చూడగలరు. 2020, మే 11,  సోమవారం జరగనుంది.

రియల్మి నార్జో 10 :  ఫీచర్లు

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు నిర్ధారించబడ్డాయి. నార్జో 10 వెనుకవైపు 48 MP క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుందని చెబుతున్నారు. కెమెరాలు నిలువుగా ఉంచబడ్డాయి. నార్జో 10A వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తాయని మరియు 6.5-అంగుళాల డిస్ప్లేతో వస్తాయని చెబుతున్నారు. ఈ ఫోన్ల యొక్క మిగిలిన లక్షణాలు తెలియవు కాని వీటి టీజింగ్స్ ద్వారా గేమర్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నందున, ఇది పోకో ఎక్స్ 2 మరియు రెడ్మి నోట్ 8 ప్రో వంటి ఫోన్లతో పోటీపడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :