Realme NARZO Power 5G launched with dual chip power and big battery
Realme NARZO Power 5G: రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి ఈరోజు నార్జో పవర్ ఫోన్ ను మంచి హంగులతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ మరియు 10,001 mAh అతిభారీ బాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈరోజు ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన రియల్‌మీ నార్జో పవర్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) ను రూ . 27,999 రేటుతో మరియు హై ఎండ్ వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) ను రూ . 29,999 రేటుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ట్రాన్స్ సిల్వర్ మరియు ట్రాన్స్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో జతగా గొప్ప లాంచ్ అవా`ఆఫర్లు కూడా అందించింది.
రియల్‌మీ నార్జో పవర్ భారీ వన్ డే స్పెషల్ లాంచ్ ఆఫర్లు అందించింది. అవేమిటంటే ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల తక్షణ ప్రైస్ డ్రాప్ మరియు రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు డీల్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 23,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ డే సేల్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ నార్జో పవర్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ తో వస్తుంది. ఇందులో డిస్ప్లే కోసం ప్రత్యేకమైన హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్ మరియు ఫోన్ ను నడిపించే మీడియాటెక్ Dimensity 7400 Ultra చిప్ సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.8 అంగుళాల కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ కర్వుడ్ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR 10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప 1.5K రిజల్యూషన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కలిగిన రెండు చిప్ సెట్ మరియు స్క్రీన్ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఇందులో 8జీబీ ఫిజికల్ ర్యామ్ 10 జీబీ డైనమిక్ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. realme UI 7.0 లేటెస్ట్ సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో ఈ ఫోన్ ను రియల్‌మీ లాంచ్ చేసింది.
కెమెరా పరంగా, ఇందులో వెనుక 50MP Sony IMX882 ప్రధాన సెన్సార్ జతగా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన రియర్ ఉంది. ఈ రియర్ కెమెరా 30FPS తో 4K వీడియో రికార్డింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ మంచి ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు రియల్‌మీ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మంచి సెల్ఫీ లు అందించే 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
Also Read: Amazon Electronics Premier League సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోండి.!
ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 10,001 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 27W వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఆఫర్ చేసింది. ఈ ఫోన్ కూడా రియల్ మీ ముందు ఫోన్లు మాదిరిగా IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో అందించింది.