Realme Narzo N65 with dimensity 6300 soc launched today
Realme Narzo N65: రియల్ మీ ఈరోజు సైలెంట్ గా నార్జో సిరీస్ బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసింది. ఈ నెలలో ప్రీమియం సెగ్మెంట్ నుండి Realme GT 6T స్మార్ట్ ఫోన్ ను తెచ్చిన రియల్ మీ, ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి రియల్ మీ నార్జో N65 ని విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
Realme Narzo N65: ప్రైస్
రియల్ మీ నార్జో N65 స్మార్ట్ ఫోన్ ను రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 128GB) ను ఈ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ను రూ. 12,499 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మే 31వ తేది మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ Realme.com మరియు Amazon నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
లాంచ్ ఆఫర్స్:
ఈ ఫోన్ విడుదల సమయంలో లాంచ్ ఆఫర్లు కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను రియల్ మీ ప్రకటించింది. ఈ ఆఫర్లను ఫస్ట్ సేల్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు పొందుతారు. అలాగే, రూ. 1,299 రూపాయల విలువైన రియల్ మీ వైర్లెస్ నియో 2 నెక్ బ్యాండ్ ని రూ. రూ. 899 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, రూ. 574 రూపాయల విలువైన రియల్ మీ కేర్ ప్లస్ పైన 50% తగ్గింపు కూడా ఈ ఫోన్ ఆఫర్లలో భాగంగా అందించింది.
Also Read: Moto G04s Launch: మోటో బడ్జెట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
Realme Narzo N65: ఫీచర్లు
రియల్ మీ నార్జో ఎన్65 5జి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ సరికొత్త ప్రోసెసర్ డైమెన్సిటీ 6300 తో అందించింది. ఇందులో 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ కూడా వుంది. అంతేకాదు, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ రియల్ మీ ఫోన్ లో 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, మినీ క్యాప్సూల్ 2.0 సపోర్ట్ కలిగిన బిగ్ డిస్ప్లే వుంది.
ఈ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరాతో అనేక కెమెరా ఫీచర్లు మరియు ఫిల్టర్ లు ఉన్నట్లు కూడా రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ 5000 mAh పెద్ద బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో కూడా ఎయిర్ జెశ్చర్, డైనమిక్ బటన్ మరియు రీడింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.