Realme NARZO N63 first sale with huge deals starts from today
Realme NARZO N63: రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ రియల్ మీ నార్జో ఎన్ 63 ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. బడ్జెట్ ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్, స్టన్నింగ్ ప్రీమియం డిజైన్ మరియు రెయిన్ వాటర్ టచ్ వంటి మరిన్ని ఫీచర్ లతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు స్పెక్స్ తెలుసుకోండి.
రియల్ మీ నార్జో ఎన్ 63 స్మార్ట్ ఫోన్ రూ. 8,499 ప్రారంభ ధరతో వచ్చింది. ఈ బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ రూ. 8,999 ధరతో ఉంటుంది మరియు ఇది 4GB ర్యామ్ జతగా 128GB స్టోరేజ్ తో వస్తుంది.
రియల్ మీ నార్జో ఎన్ 63 ఫోన్ పైన ఈరోజు లాంఛ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ సేల్ నుండి ఫోన్ పైన రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 14 జూన్ రాత్రి 11:59 నిమిషాల కంటే ముందు కొనుగోలు చేసే యూజర్లు ఈ ఆఫర్లను అందుకోవచ్చు.
Also Read: Samsung Music Frame Speaker ను ఇండియాలో కూడా పరిచయం చేయబోతున్న శామ్సంగ్.!
రియల్ మీ నార్జో ఎన్ 63 స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ మరియు వెనుక వేగాన్ లెథర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చూడడానికే కాదు చేతిలో పట్టుకున్నా కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫీల్ ను ఇస్తుంది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే ఐ కంఫర్ట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, మినీ కాప్స్యూల్ 2.0 మరియు 450 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్ లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ UNISOC T612 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ రియల్ మీ కొత్త ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.