భారీ ఆఫర్లతో Realme లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ Narzo N53 ఫస్ట్ సేల్.!
Realme Narzo N53 ఫస్ట్ సేల్ ఈరోజు మొదలువుతుంది
ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సరిగా సేల్ జరగనున్నది
రియల్ మి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme Narzo N53 ఫస్ట్ సేల్ ఈరోజు మొదలువుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. రియల్ మి ఈ నార్జో ఎన్ 53 ని ఆకర్షణీయమైన కెమేరా మోడ్యుల్ మరియు మినీ కాప్సూల్ ఫీచర్ తో బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది మరియు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సరిగా సేల్ జరగనున్నది. ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను క్రింద చూడవచ్చు.
SurveyRealme Narzo N53: ప్రైస్ & ఆఫర్స్
రియల్ మి నార్జో ఎన్ 53 యొక్క బేసిక్ వేరియంట్ రూ. 8,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 10,999 ధరతో లాంచ్ చెయ్యబడింది. ఇందులో, బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ను హై ఎండ్ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డు తో కొనే వారు రూ. 1,000 వరకూ డిస్కౌంట్ ను పొందగలరు. అలాగే, రూ. 3000 వరకూ అదనపు బెనిఫిట్స్ జియో కస్టమర్లు పొందే అవకాశం అందించింది.
రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు రియల్ మి అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.
Realme Narzo N53: ప్రత్యేకతలు
రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ వెనుక ఐఫోన్ మాదిరిగా కనిపించే ట్రిపుల్ కెమేరా మోడ్యూల్ తో వచ్చింది మరియు ఇందులో డ్యూయల్ కెమేరాలు మాత్రామే వున్నాయి. ఇందులో 50MP డ్యూయల్ కేమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ కొత్త డిజైన్ మరియు మినీ కాప్స్యూల్ ఫీచర్ తో కూడా ఉంటుంది.
రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్, 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్, 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.74 ఇంచ్ బిగ్ డిస్ప్లే, ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3-కార్డ్ స్లాట్ మరియు 33W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కాలిగి వుంది ఈ రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile