Realme Narzo 90 5G launched with new look design and bright display
Realme Narzo 90 5G: రియల్ మీ ఈరోజు నార్జో 90 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. వీటిలో నార్జో 90 స్మార్ట్ ఫోన్ ను న్యూ డిజైన్ మరియు సూపర్ బ్రెట్ డిస్ప్లే తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెగ్మెంట్ బ్రైటెస్ట్ డిస్ప్లే ఫోన్ గా వచ్చింది మరియు గొప్ప కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
రియల్ మీ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ధరతో చేసింది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 18,499 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 24వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు రియల్ మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ ఫోన్ కేవలం 7.79mm సైజులో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు కేవలం 181 గ్రాముల బరువుతో ఈ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ విక్టరీ పవర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఈ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ లో భారీ 7000 mAh టైటాన్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్ మరియు విక్టరీ గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది.
రియల్ మీ ఈ ఫోన్ ను 6.57 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 MAX చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ realme UI 6.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.
Also Read: End Of Season Sale దెబ్బకి భారీ డిస్కౌంట్ తో 11 వేలకే 43 ఇంచ్ Smart Tv లభిస్తోంది.!
రియల్ మీ నార్జో 90 స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony మెయిన్ కెమెరా 2MP మోనోక్రోమ్ కెమెరా కలిగిన రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ముందు కూడా గొప్ప 50MP సెల్ఫీ కెమెరాని రియల్ మీ అందించింది. ఈ ఫోన్ 30FPS వద్ద 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్, ఎఐ ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ వంటి గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.