Realme Narzo 80x 5G price and complete features know one day before
Realme Narzo 80x 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు మార్కెట్లో లాంచ్ కానుండగా, ఈ ఫోన్ యొక్క ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్లు ఒక రోజు ముందే అందిస్తున్నాము. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు IP 69 రేటింగ్ వాటర్ ప్రూఫ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది. రేపు విడుదల కాబోతున్న రియల్ మీ నార్జో 80x 5జి పూర్తి ఫీచర్స్ మరియు ప్రైస్ ఏమిటో తెలుసుకుందామా.
రియల్ మీ నార్జో 80x 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ మరియు IP 69 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ Hi-Res Audio సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 200% సూపర్ వాల్యూమ్ మోడ్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా కేవలం 7.94mm చాలా సన్నగా ఉంటుంది మరియు కేవలం 197 గ్రాముల బరువుతో చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ రియల్ మీ కొత్త ఫోన్ స్పీడ్ వేవ్ ప్యాట్రన్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6400 తో లాంచ్ అవుతుంది మరియు దీనికి తగిన ర్యామ్ మరియు స్టోరేజ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి LPDDR4 ర్యామ్ సపోర్ట్ ను మాత్రమే అందించే అవకాశం ఉంటుంది.
రియల్ మీ నార్జో 80x 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో మంచి కనెక్టివిటీ కోసం AI స్మార్ట్ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ ఉన్నట్లు కూడా రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ భారీ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Samsung Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
రియల్ మీ నార్జో 80x 5జి స్మార్ట్ ఫోన్ ప్రైస్ గురించి కూడా కంపెనీ ముందే హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ 13K సెగ్మెంట్ లో బెస్ట్ గేమింగ్ చాయిస్ అని కంపెనీ టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను అండర్ రూ. 13,000 రూపాయల ధరలో అందిస్తున్నట్లు క్లియర్ చేసింది. అయితే, ఈ ప్రైస్ ఆఫర్స్ కలుపుకొని ఉంటుందో లేక రెగ్యులర్ ప్రైస్ అవుతుందో చూడాలి.