Realme Narzo 80x 5G launched with big battery and ip 69 waterproof feature
Realme Narzo 80x 5G: రియల్ మీ ఈరోజు నార్జో 80x సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఇందులో రియల్ మీ నార్జో 80x స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ రియల్ మీ కొత్త ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర మరియు ఆఫర్స్ తెలుసుకోండి.
రియల్ మీ నార్జో 80x స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 13,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండవ మరియు హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లిమిటెడ్ పీరియడ్ సేల్ ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 250 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 11,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది.
రియల్ మీ నార్జో 80x 5జి స్మార్ట్ ఫోన్ స్పీడ్ వేవ్ ప్యాట్రన్ తో చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.94mm మందంతో చాలా సన్నగా మరియు 197 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 5G ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 18GB వరకు Dynamic RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ realme UI 6.0 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది.
Also Read: Realme NARZO 80 Pro 5G స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
రియల్ మీ నార్జో 80x 5జి స్మార్ట్ ఫోన్ 50MP OMNIVISION మెయిన్ కెమెరా మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ అండర్ వాటర్ షూటింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W సూపర్ VOOC సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Hi-Res Audio సర్టిఫికేషన్, సూపర్ లైనర్ స్పీకర్ మరియు నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ మైక్ కూడా ఉన్నాయి.