Realme Narzo 80 Lite with 6300 mah battery launched under 7k segment
Realme Narzo 80 Lite : రియల్ మీ ఈరోజు నార్జో సిరీస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నార్జో 80 లైట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 7,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 6300 mAh బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 7,299 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 8,299 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ తో రూ. 700 రూపాయల ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 6,599 మరియు రూ. 7,599 ధరకే లభిస్తుంది. జూలై 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ రియల్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆర్మర్ షెల్ ప్రొటక్షన్ మరియు మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ కలిగిన స్ట్రాంగ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ IP 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో, 6.74 ఇంచ్ డిస్ప్లే అందించింది మరియు ఈ డిస్ప్లే 563 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ UNISOC T7250 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4 జీబీ / 6 జీబీ ఫిజికల్ ర్యామ్, 12 జీబీ వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రియల్ మీ లేటెస్ట్ UI పై ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అయ్యింది.
నార్జో 80 లైట్ స్మార్ట్ లో వెనుక పల్స్ లైట్ సపోర్ట్ కలిగిన 13M (OV13B10) డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 1080 వీడియో షూట్, స్లో మోషన్, డ్యూయల్ వ్యూ వీడియో, నైట్ మోడ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ OReality Audio effect తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 6300mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Realme 15 5G: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
డిజైన్ పరంగా, ఈ ఫోన్ కేవలం 7.94mm మందంతో స్లీక్ గా ఉంటుంది మరియు అందంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ బీచ్ గోల్డ్ మరియు ఒడిసియన్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.