Realme Narzo 70 Turbo 5G launch date and key specs revealed
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న రియల్ మీ, ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా రియల్ మీ వెల్లడించింది.
రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా బయటపెట్టింది.
రియల్ మీ నార్జో 70 టర్బో ను మీడియాటెక్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ప్రోసెసర్ తో తీసుకొస్తున్నట్లు రియల్ మీ వెల్లడించింది. అదేమిటంటే, ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ పెర్ఫార్మెన్స్ వివరాలు తెలియ చేసే స్కోర్ వివరాలు కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ లో అందించే డైమెన్సిటీ చిప్ సెట్ 750K AnTuTu స్కోర్ ను కలిగి ఉంటుంది మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ 4nm ఫ్యాబ్రికేషన్ పై నడుస్తుంది మరియు ఎఫిషియంట్ గా ఉంటుంది. ఈ ప్రోసెసర్ తో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: విశాఖపట్నంలో BSNL 4G సర్వీస్ లు మొదలు పెట్టిన ప్రభుత్వ టెలికాం.!
ఈ ఫోన్ యొక్క ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ కేవలం 7.6mm మందం మాత్రమే ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 185 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందిట.
ఈ ఫోన్ ఎల్లో మరియు బ్లాక్ డ్యూయల్ కలర్ తో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ ఉంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ కోసం డేట్ ప్రకటించింది కాబట్టి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేసే అవకాశం ఉంటుంది.