ఈరోజు రియల్ మీ నార్జో సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది, అదే, Realme Narzo 50 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో హీలియో G96 SoC తో విడుదల చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, స్మూత్ డిస్ప్ల`మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.15,499 ధరతో ప్రకటించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 3న మద్యహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్స్, realme.com మరియు మీ దగ్గరలోని రిటైల్ స్టార్ లలో కూడా లభిస్తుంది.
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. అంటే, 6GB + 5GB తో 11GB వరకూ పనితనాన్ని అందించగలదని వెల్లడించింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.