Realme Narzo 30 5G: స్టన్నింగ్ డిజైన్, సూపర్ ఫీచర్లతో వచ్చింది

HIGHLIGHTS

Realme Narzo 30 5G స్మార్ట్ ఫోన్ విడుదల

మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో ఉన్నా మంచి ఫీచర్లతో వస్తుంది

Realme సంస్థ ఈరోజు తన లేటెస్ట్ Realme Narzo 30 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇప్పటికే,కేవలం బడ్జెట్ ధరకే 5G స్మార్ట్ ఫోన్లను ప్రకటిస్తున్న Realme ఇప్పుడు మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను అందించింది. అయితే, ఈ 5G ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో ఉన్నా మంచి ఫీచర్లతో వస్తుంది. Realme Narzo 30 5G లో 48MP నైట్ స్కెప్ ట్రిపుల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో పాటుగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లను అందించింది. Realme Narzo 30 5G యొక్క పూర్తి వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

Realme Narzo 30 5G: Price

రియల్మి నార్జో 30 5G స్మార్ట్ ఫోన్ కేవలం 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ధరను రూ.15,999 రూపాయలుగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ జూన్ 30 వ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

Realme Narzo 30 5G: స్పెక్స్

ఈ Narzo 30 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 700 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు ARM Mali-G57 GPU తో ఉంటుంది. దీనికి జతగా  గరిష్టంగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ రియల్మి స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వస్తుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా నైట్ స్కెప్ సపోర్ట్ తో వస్తుంది మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ఈ కెమెరా UIS వీడియో స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది మరియు కొత్త నైట్ స్కెప్ ఫిల్టర్లతో వస్తుంది. ముందుభాగంలో, 16MP Samsung S5K3P9SP04 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది.

ఇక ఛార్జింగ్  టెక్నాలజీ మరియు బ్యాటరీ విషయానికి వస్తే, ఈ 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 18 W క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ట్ తో వస్తుంది. ఈఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా Realme UI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :