రియల్‌మీ నార్జో 20A చవక ధరలో చక్కని ఫీచర్లతో వచ్చింది

Updated on 21-Sep-2020
HIGHLIGHTS

రియల్‌మీ నార్జో 20 సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లను ఈరోజు రియల్‌మీ ఇండియాలో విడుదల చేసింది.

రియల్‌మీ 20A స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకునే ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది.

కేవలం రూ.8,499 రుపాయల ధరలో ట్రిపుల్ కెమేరా, పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో విడుదల చెయ్యబడింది.

రియల్‌మీ నార్జో 20 సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లను ఈరోజు రియల్‌మీ ఇండియాలో విడుదల చేసింది. వీటిలో, రియల్‌మీ 20A స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకునే ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, కేవలం రూ.8,499 రుపాయల ధరలో ట్రిపుల్ కెమేరా, పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో విడుదల చెయ్యబడింది.  

రియల్‌మీ నార్జో 20A ధర

ఈ రియల్‌మీ నార్జో 20A స్మార్ట్ ఫోన్ రేండు వేరియంట్లలో లభిస్తుంది అవి:   

1. రియల్‌మీ (3GB + 32GB ) వేరియంట్ ధర : Rs.8,499

1. రియల్‌మీ (4GB + 64GB ) వేరియంట్ ధర : Rs.9,499    

రియల్‌మీ నార్జో 20A ఫీచర్లు

రియల్‌మీ నార్జో 20A ఒక పెద్ద 6.5-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. ఇది 8.9 మిల్లీమీటర్ల మందం మరియు 195 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

నార్జో 20 ఎ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 3 జిబి / 4 జిబి ర్యామ్ మరియు 32 జిబి / 64 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందించబడుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫోన్ RealmeUI తో పనిచేస్తుంది. ఇది మైక్రో ఎస్‌డి కార్డుల ద్వారా 256 జిబి వరకు స్టోరేజ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది.

రియల్‌మీ నార్జో 20 ఎ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 12 ఎంపి కెమెరా, 2 ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.

నార్జో 20A 5,000mAh బ్యాటరీతో సాధారణ 10W ఛార్జింగ్ వేగంతో అమర్చబడి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :