Realme యొక్క అతిపెద్ద 6,000 బ్యాటరీ ఫోన్ సేల్ మరికొద్ది సేపట్లో…

HIGHLIGHTS

రియల్ మీ నార్జో 20 యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Realme.com నుండి మొదలవుతుంది.

Realme Narzo 20 తక్కువ ధరలో వెనుక ట్రిపుల్ కెమెరాలు, అతిపెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే మరియు వేగవంతమైన ప్రాసెసర్ కలిగి వుంది.

రియల్‌ మీ నార్జో 20 ధర 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌ రూ .10,499

Realme అతితక్కువ ధరలో అతిపెద్ద 6,000 mAh బ్యాటరీతో Realme Narzo 20 ను లాంచ్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ఈ రియల్ మీ నార్జో 20 యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Realme.com నుండి మొదలవుతుంది. ఈ మొబైల్ ఫోన్, తక్కువ ధరలో వెనుక ట్రిపుల్ కెమెరాలు, అతిపెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే మరియు వేగవంతమైన ప్రాసెసర్ కలిగి వుంది.        

రియల్ మీ నార్జో 20 ధర

రియల్‌ మీ నార్జో 20 ధర 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌కు రూ .10,499 మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ .11,499. ఈ స్మార్ ఫోన్ గ్లోరీ సిల్వర్ మరియు విక్టరీ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది.

Realme Narzo 20 ఫీచర్లు

రియల్ మీ నార్జో 20 లో ఒక 6.5-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది, ఇది నార్జో 20A మాదిరిగానే ఉంటుంది, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌ తో పాటు. ఫోన్ 9.8 మిల్లీమీటర్ల మందం మరియు 200 గ్రాముల బరువు ఉంటుంది.

మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్‌ తో నడిచే నార్జో 20 స్టోరేజ్ అప్షన్స్ కోసం  4 జిబి ర్యామ్ మరియు 64 జిబి / 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో జతచేయబడ్డాయి. ఈ ఫోన్ 256GB వరకు మైక్రో SD కార్డులకు మద్దతు ఇస్తుంది మరియు Realme UI లో నడుస్తుంది.

రియల్ మీ నార్జో 20 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 ఎంపి కెమెరా, 11 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ మరియు 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.

నార్జో 20 లో అతిపెద్ద 6000W ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :