ఇక రియల్మీ 6 మరియు 6 ప్రో ని మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో మునిగిన Realme

Updated on 02-Nov-2019
HIGHLIGHTS

ఈ సిరిస్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 చిప్ సెట్ ఆధారితంగా రావచ్చు

ఇండియాలో చాలా రకాలైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన Realme సంస్థ, వాటన్నింటిలో ముఖ్యంగా రియల్మీ 5 సిరీస్ నుండి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందింది. వరుసగా, 48MP మరియు 64MP కలిగినటువంటి కెమేరాలతో అదీకూడా నాలుగు కెమేరాల సెటప్పుతో తన స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అందుకే కాబోలు, ఈ విజయవంతమైన రియల్మీ 5 సిరిస్ యొక్క తరువాతి తరం స్మార్ట్ ఫోనును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, రియల్మీ 6 యొక్క ఒక రిటైల్ బాక్స్ ఇప్పుడు ఆన్లైన్లో కనిపించింది. దీని కారణంగా, అందరి ద్రుష్టి కూడా  రియల్మీ 6 సిరీస్ ను తీసుకురానున్నదన్న విషయం పైన పడింది. అయితే, ఈ బాక్స్ గురించిన సమాచారాన్ని Slashleaks ముందుగా లీక్ చేసింది మరియు దీనికి సంబంచిన మరికొన్ని కీలకమైన విషయాలను కూడా లీక్ చేసింది. ఈ సిరిస్ నుండి రియల్మీ 6 మరియు రియల్మీ 6  ప్రో వేరియంట్ కూడా రావచ్చని చెబుతోంది.

ఇక త్వరలో రావచ్చని అంచనా వేస్తున్న ఈ రియల్మీ 6 మరియు రియల్మీ 6  ప్రో ఫోన్ల విషయానికి వస్తే వీటికి సంబంచి ప్రాసెసర్ పరంగా, ఈ సిరిస్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 చిప్ సెట్ ఆధారితంగా రావచ్చని మరియు కెమేరాల పరంగా ఈ ఫోన్లు వెనుక ఒక పెంటా కెమేరా అంటే 5 కెమేరాల సేటప్పుతో రావచ్చని కూడా ఈ లీక్స్ చెబుతున్నాయి. అయితే, మిగిలిన స్పెషిఫికేషన్ల గురించి మాత్రం ఎటువంటి సమాచారాన్ని తెలుపలేదు. ఇవన్నీ నిజమైతే గనుక, ఈ రానున్న Realme 6 స్మార్ట్ ఫోన్ రియల్మీ నుండి వచ్చిన మొట్ట మొదటి పెంటా కేమెరా ఫోనుగా ఉంటుంది.                                 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :